Ashadhi Amavasya 2022: ఆషాఢమాసంలో అమావాస్య రెండు రోజులు ఉంటుంది. జూన్ 28న హలహరిణి అమావాస్య, జూన్ 29న స్నానాల అమావాస్య. సంవత్సరంలో వచ్చే అమావాస్య, పూర్ణిమలన్నీ చాలా ముఖ్యమైనవి అయినప్పటికీ, ఆషాఢమాసంలోని అమావాస్యకు (Ashadhi Amavasya 2022) ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది చాతుర్మాస్ ప్రారంభానికి ముందు వచ్చే చివరి అమావాస్య. మత గ్రంధాలలో ఆషాఢ అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం నిషేధించబడింది. ఈ పనులు చేయడమంటే జీవితంలోనే కష్టాలను ఆహ్వానించడమే.
అమావాస్య రోజు ఈ పనులు చేయకండి
>> ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడకండి. ఇది జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది.
>> అమావాస్య రోజు ప్రయాణం మానుకోవాలి. ఈ రోజు చేసే ప్రయాణాలు పెద్దగా ఫలించవు, కానీ చాలాసార్లు నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.
>> అమావాస్య రోజున గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు. షేవింగ్ కూడా చేసుకోకూడదు.
>> అమావాస్య రోజున పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. చంద్రుని స్థానం మనస్సును ప్రభావితం చేస్తుంది. అమావాస్య సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది, ఇది అనేక సమస్యలను సృష్టించగలదు.
>> అమావాస్య రోజు రాత్రి నిర్జన ప్రదేశానికి లేదా శ్మశాన వాటికకు వెళ్లవద్దు. ఈ రోజున ప్రతికూల శక్తులు ఈ ప్రదేశాలలో మరింత చురుకుగా ఉంటాయి. ఇవి అనేక సమస్యలను కలిగిస్తాయి.
>> అమావాస్య నాడు బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది.
Also read: Garuda Puran: ఎంత కష్టపడి పనిచేసినా మీ చేతిలో డబ్బు నిలవట్లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.