Ashadha Amavasya 2022: ఆషాఢ మాసం అమావాస్య తిథి నాడు ఆషాఢ అమావాస్య స్నానం చేసి దానం చేస్తారు. ఈ సంవత్సరం ఆషాఢ అమావాస్య (Ashadha Amavasya 2022) జూన్ 29 బుధవారం నాడు. ఆషాఢ అమావాస్య తిథి జూన్ 28 మంగళవారం ఉదయం 05:52 నుండి జూన్ 29 ఉదయం 08:21 వరకు. జూన్ 29న సూర్యోదయ సమయంలో అమావాస్య తిథిని స్వీకరిస్తున్నారు కాబట్టి ఈ రోజు మాత్రమే అమావాస్య స్నాన దానం చేస్తారు. అమావాస్యనాడు స్నానం, దానం చేయడం వల్ల పూర్వీకులు పుణ్యప్రాప్తి చెందుతారు. ఈ రోజున మీరు కోరుకుంటే కాల సర్ప దోషం నుండి కూడా విముక్తి పొందవచ్చు. దీని కోసం మీరు అమావాస్య నాడు కొన్ని పరిహారాలు చేయాలి.
కాల సర్ప దోషాన్ని నివారించాలంటే...
1. అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తరువాత, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. పూర్వీకులకు తర్పణం వదిలి.. ఆ తర్వాత వెండితో చేసిన సర్ప ప్రతిరూపాన్ని పూజించాలి. తర్వాత నీటిలో మునక వేయండి. ఇలా చేయడం వల్ల కాల సర్ప దోషం (Kaala Sarpa Dosham) నుండి విముక్తి లభిస్తుంది.
2. కాల సర్ప దోషం నుండి బయటపడటానికి సులభమైన మార్గం శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం. అమావాస్య నాడు స్నానమాచరించి శివుని ముందు ఆసనం వేసుకుని కూర్చుని నిండు భక్తితో శివతాండవ స్తోత్రాన్ని పఠించాలి. శివుని అనుగ్రహంతో కాల సర్ప దోషం తొలగిపోతుంది.
3. శివుడు కాలానికి అతీతుడు, అందుకే మహాకాళుడు. అతని ఆశీర్వాదం పొందిన వ్యక్తిని కాల సర్ప దోషం ఏమీ చేయలేదు. రాహు, కేతువుల వల్ల కాల సర్ప దోషం ఏర్పడుతుంది. దీన్నుంచి బయటపడాలంటే అమావాస్య నాడు రాహుకాలంలో శివుని పూజించండి.
4. కాల సర్ప దోషం నుండి బయటపడటానికి, మీరు రాహు గ్రహ శాంతిని చేయవచ్చు. మీరు దీని నుండి ప్రయోజనం కూడా పొందవచ్చు.
5. కాల సర్ప దోషం పోవాలంటే శివునికి రుద్రాభిషేకం చేయడం కూడా మంచిదే కానీ అమావాస్య నాడు శివుడు కొలువై ఉంటాడా లేదా అనేది చూడాలి. శివుడు నివసించే రోజు రుద్రాభిషేకం చేస్తారు. శ్రావణ మాసం రాబోతుంది. కావాలంటే ఆ మాసంలో రుద్రాభిషేకం చేయించుకోవచ్చు. శ్రావణ మాసం భోలేనాథ్‌కు అత్యంత ఇష్టమైన నెల.
Also Read; Maa Lakshmi Remedies: లక్ష్మిదేవికి ఈ పరిహారాలు చేస్తే... జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
మీ జాతకంలో కాల సర్ప దోషం ఉందా? ఆషాఢ అమావాస్య రోజున ఈ 5 పరిహారాలు చేయండి..
జూన్ 29న ఆషాఢ అమావాస్య
కాల సర్ప దోషం నుండి విముక్తికి చర్యలు