Ashada Masam 2022: నేటి నుంచి ఆషాఢమాసం ప్రారంభం.. ఈ మాసం ప్రత్యేకతలేంటో తెలుసా..!

Ashada Masam 2022:  నేటి నుంచి భారతీయులు ప్రముఖ మాసంగా భావించే ఆషాఢమాసం రోజులు మొదలైయ్యాయి. వీటిని పలు శాస్త్రంలో గుప్త నవరాత్రులు అని కూడా అంటారు.  ఆషాఢ శుక్ల పక్షం.. ప్రతిపదం నుంచి మొదలవుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 30, 2022, 10:34 AM IST
  • నేటి నుంచి ఆషాఢమాసం ప్రారంభం
  • ఈ మాసంలో చాలా ప్రత్యేకతలు
  • ఈ శుభ యోగాలు వస్తాయి
 Ashada Masam 2022: నేటి నుంచి ఆషాఢమాసం ప్రారంభం.. ఈ మాసం ప్రత్యేకతలేంటో తెలుసా..!

Ashada Masam 2022:  నేటి నుంచి భారతీయులు ప్రముఖ మాసంగా భావించే ఆషాఢమాసం రోజులు మొదలైయ్యాయి. వీటిని పలు శాస్త్రంలో గుప్త నవరాత్రులు అని కూడా అంటారు.  ఆషాఢ శుక్ల పక్షం.. ప్రతిపదం నుంచి మొదలవుతుంది. ఈ సంవత్సరం, 30 జూన్ 2022, గురువారం.. ఈ రోజు నుంచి ప్రారంభమైనవి. మళ్లీ ఇది  జూలై 9న ముగియనుంది. భారత్‌లో చాలా మంది ఈ రోజు నుంచి 9 రోజుల పాటు దుర్గా మాతను పూజిస్తారు. దేవిని పూజించడం వల్ల కుటుంబంలో సకల సుభాలు జరుగుతాయని నమ్మకం. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆషాఢంలో అమ్మవారిని కొలవడం ఆనవాయితి.  

ఈ శుభ యోగాలు వస్తాయి:

గుప్త నవరాత్రులకు ముందు అనేక శుభ యోగాలు వస్తాయి. ముఖ్యంగా గురు పుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, అదాల్ యోగం, విదాల్ యోగాలు జూన్ 30 నుంచి మొదలవుతాయి. దానితో పాటు పుష్య నక్షత్రం గడియలు కూడా వస్తాయి. ఈ యోగాలన్ భారతీయులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. దీని కోసం జూన్ 30వ తేదీ ఉదయం ఘటస్థాపన చేయడం శుభప్రదం.

ఆషాఢమాసం యొక్క ముఖ్యమైన నియమాలు:

1.  ఈ నవరాత్రులలో రెండు సమయాలలో అమ్మవారును పూజించాలి. ముఖ్యంగా సాయంత్రం తప్పనిసరిగా హారతించాలి.

2. నవరాత్రుల్లో 9 రోజుల పాటు మాంసాహారం తినవద్దు.

3. ఎవరికీ హాని కలిగించవద్దు. ఎలాంటి అనైతిక చర్యలు చేయవద్దు.

4. నవరాత్రుల్లో బ్రహ్మచర్యాన్ని పాటించడం చాలా మేలు.

5. ప్రశాంతంగా మనుసును నిలుపుకోవాలి. అంతేకాకుండా ఎవరితోనూ కోపంగా ప్రవర్తంచకండి.

ఈ ఆషాఢమాసం వచ్చే పర్వదినాలు ఇవే..

1. పూరీ జగన్నాధ రధయాత్ర - ఆషాఢ శుద్ధ విదియరోజు

2. స్కంధ పంచమి - ఆషాఢ శుద్ధ పంచమిరోజు

3.ఆషాడమాసంలో సుబ్రహ్మణ్యేశ్వరునికి ఆషాఢ శుద్ధ షష్టి రోజున షోడపచారాలతో పూజ చేస్తారు

4. ఆషాడమాసంలో మిత్రాఖ్య భాస్కర పూజను.. ఆషాడ శుద్ధ సప్తమి రోజు జరుపుకుంటారు.

5. మిహషఘ్ని పూజను ఆషాడ శుద్ధ అష్టమి రోజు జరుపుకుంటే సకల శుభాలు జరుగుతాయి.

6. ఐంద్రదేవి పూజ - ఆషాడ శుద్ధ నవమి

7. శాకవ్రత మహాలక్ష్మి వ్రతారంభము ఆషాడమాసంలో వచ్చే  ఆషాడ శుద్ధ దశమి రోజూ జరుపుతారు.

8.  మహలక్ష్మి వ్రతాన్ని ఆషాఢ శుద్ధ దశమి రోజు జరుపుకుంటారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read:  White Hair Treatment At Home: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

Also Read: Meena Husband Vidyasagar: పావురాల వల్ల ప్రాణాలు కోల్పోయిన మీనా భర్త... అప్పట్లోనే జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. కానీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News