Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ నాడు 'మహా సంయోగం'.. ఈ 4 రాశులపై డబ్బు వర్షం..

Akshaya Tritiya 2023: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. ఈరోజున చాలా మంది బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2023, 08:12 AM IST
Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ నాడు 'మహా సంయోగం'.. ఈ 4 రాశులపై డబ్బు వర్షం..

Akshaya Tritiya 2023 Significance: వైశాఖ మాసంలో శుక్ల పక్షం తృతీయ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకోనున్నారు. ఇది హిందువులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈరోజున చాలా మంది బంగారం మరియు వెండి వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఈరోజున దేవగురు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడు, బుధుడు, రాహువు మరియు యురేనస్ తో కలిసి గురుడు పంచగ్రహి యోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ మహా సంయోగం కారణంగా నాలుగు రాశుల వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

అక్షయ తృతీయ ఈ రాశులవారికి చాలా శుభప్రదం
మేషం - అక్షయ తృతీయ నాడు ఏర్పడిన పంచగ్రహి యోగం మేషరాశి వారికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ యోగం ఇదే రాశిలో ఏర్పడనుంది. ప్రతి పనిలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు కెరీర్‌లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఈ రోజు దానధర్మాలు చేయడం, బంగారం కొనుగోలు చేయడం శుభఫలితాలను ఇస్తుంది.
వృషభం - పంచగ్రాహి యోగం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. బిజినెస్ వృద్ధి చెందుతుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. ఈ సమయంలో వెండి కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. 
వృశ్చికం- అక్షయ తృతీయ వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు కొత్త ఇల్లు, కారు లేదా బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. 
కర్కాటక రాశి - మహా సంయోగం కర్కాటక రాశి వారిని ఆర్థికంగా బలపడేలా చేస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. బిజినెస్ చేసే వారు భారీగా లాభపడతారు. కొత్త పనులను ప్రారంభించడానికి అదే మంచి సమయం. 

Also Read: Surya Guru Yuti 2023: మేష రాశిలో అరుదైన కలయిక.. ఈ రోజు నుంచి ఈ 3 రాశులకు అన్నీ లాభాలే..

బంగారం కొనడానికి అనుకూలమైన సమయం
అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి శుభ సమయం ఉదయం 07:49 నుండి ప్రారంభమై.. రోజంతా కొనసాగుతుంది. ఇవాళ బంగారం, వెండి, ఇల్లు, కారు మొదలైన విలువైన వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. 

Also read: Guru Gochar 2023: వచ్చే 7 నెలలు ఈ రాశులకు కష్టాలే కష్టాలు... ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News