Akshaya Tritiya 2023: 125 ఏళ్ల తరువాత అత్యంత అరుదైన అక్షయ తృతీయ ఇదే, ఆ 4 రాశులకు వద్దంటే డబ్బు

Akshaya Tritiya 2023: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అక్షయ తృతీయ అత్యంత విభిన్నం కానుంది ఏకంగా 125 ఏళ్ల తరువాత ఇలాంటి అక్షయ తృతీయ ఏర్పడనుంది. ఫలితంగా ఆ నాలుగు రాశుల జాతకం తిరిగిపోనుంది. వద్దంటే డబ్బు వచ్చి పడనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 19, 2023, 06:22 AM IST
Akshaya Tritiya 2023: 125 ఏళ్ల తరువాత అత్యంత అరుదైన అక్షయ తృతీయ ఇదే, ఆ 4 రాశులకు వద్దంటే డబ్బు

Akshaya Tritiya 2023: వైశాఖ శుక్లమాసం మూడవ తిధిన అక్షయ తృతీయ వేడుక ఉంటుంది. ఈ ఏడాది 2023లో ఏప్రిల్ 22 వ తేదీన అక్షయ తృతీయ పర్వదినాన మేషరాశిలో పంచాగ్రహ యోగం ఏర్పడనుంది. ఈ యోగం అక్షయ తృతీయ నాడు ఏర్పడటం 125 ఏళ్ల తరువాత ఇదే. 

ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు గ్రహాల దుర్లభ సంయోగం ఏర్పడనుంది. దీనిని అత్యంత మహత్వపూర్వకంగా భావిస్తారు. 125 ఏళ్ల తరువాత పంచాగ్రహ యోగం ఏర్పడటం ఇదే తొలిసారి. ఫలితంగా 4 రాశులపై లక్ష్మీదేవి కటాక్షం కురవనుంది. ఊహించని సంపద లభిస్తుంది. వద్దంటే డబ్బులు వచ్చి పడనున్నాయి. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈరోజున బంగారం, వెండి కొనుగోలు లాభం చేకూర్చనుంది. 

కర్కాటక రాశి

అక్షయ తృతీయ రోజున ఏర్పడనున్న శుభయోగం ఫలితంగా కర్కాటక రాశి జాతకులకు అపారమైన ధన సంపదలు కలగనున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. జీతభత్యాలు పెరగనున్నాయి. వ్యాపారం విస్తృతమై లాభాలు కలుగుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అనువైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

వృషభ రాశి

వృషభ రాశి జాతకులకు అక్షయ తృతీయ నాడు ఏర్పడనున్న పంచాగ్రహ యోగంతో పదవి, డబ్బులు రెండూ లభిస్తాయి. మీ పనితీరుతో మీ యజమాని ఆనందపడతాడు. ఆర్ధిక ఇబ్బందులు పూర్తిగా దూరమౌతాయి. ఒత్తిడి-సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది. ఊహించని లాభాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి జాతకులకు అక్షయ తృతీయ నాడు అన్ని విధాలా కలిసొస్తుంది. కొత్త వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేయవచ్చు. ఉద్యోగంలో అభివృద్ధి లభిస్తుంది. అపారమైన ధనలాభం కలుగుతుంది. వద్దంటే డబ్బులు వచ్చి పడతాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైన ఆటంకాలు, సమస్యలు ఎదురుకావు.

మేష రాశి

125 ఏళ్ల అనంతరం ఏర్పడనున్న పంచాగ్రహ యోగంతో మేష రాశి జాతకులకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. కొత్త బాధ్యతలు ఆనందాన్నిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. పదోన్నతి కోసం నిరీక్షిస్తున్నవాళ్లకు అంతా కలిసొస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Also read: Akshaya Tritiya 2023: ఏప్రిల్ 22న ఏర్పడనున్న పంచాగ్రహి యోగంతో ఆ 5 రాశులకు తిరగనున్న దశ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News