Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే మంచిది..ఆ సమయంలోనే బంగారం ఎందుకు కొనాలి..?

Akshaya Tritiya 2022: హైందవ సంప్రదాయంలో ప్రతి రోజూ విశేషమైనదే. అయితే కొన్ని రోజులు మరింత విశిష్టమైనవిగా చెబుతుంటారు. ఆ రోజు చేసిన పాప పుణ్యాలు రెట్టింపు ఫలితానిస్తుంటారు. అలాంటి ఉత్తమ పర్వదినాల్లో ఒకటి అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తదియకు అంత విశిష్టత ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 03:23 PM IST
  • అక్షయ తృతీయ రోజు బంగారం కోంటే ఎంత మేలు
  • శివుడిని ప్రార్థించి కుబేరుడు వరం పొందిన రోజు
  • లక్ష్మిదేవిని పూజించాలి
Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే మంచిది..ఆ సమయంలోనే బంగారం ఎందుకు కొనాలి..?

Akshaya Tritiya 2022: హైందవ సంప్రదాయంలో ప్రతి రోజూ విశేషమైనదే. అయితే కొన్ని రోజులు మరింత విశిష్టమైనవిగా చెబుతుంటారు. ఆ రోజు చేసిన పాప పుణ్యాలు రెట్టింపు ఫలితానిస్తుంటారు. అలాంటి ఉత్తమ పర్వదినాల్లో ఒకటి అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తదియకు అంత విశిష్టత ఉంది. జప, తప, దాన, య‌జ్ఞ యాగాదాలు ఆ రోజు అక్షయ ఫలితాన్నిస్తాయి. అక్షయం అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం. అందుకే ఈ రోజు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలాలనిస్తాయని నారద పురాణం చెబుతోంది. ఇతర తిథుల్లా ఈ రోజు దుర్ముహూర్తాలూ, వర్జ్యాలూ వర్తించవు. క్షణంలోనైనా శుభకార్యాలను ఆచరించొచ్చని పురాణ వచనం. త్రేతాయుగం మొదలైనది అక్షయ తృతీయ రోజునే. పరశురాముడు జన్మించిందీ ఆ రోజే.

ఆ రోజు ఏం చేయాలి..?

అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలనీ .. అలా చేయకపోతే పాపమేదో అంటుకుంటుందన్నట్లుగా ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతోంది. ఆ రోజు బంగారం, వెండి లేదా విలువైన వస్తువులు కొంటే.. వృద్ధి చెందుతాయని చాలా మంది నమ్మి అప్పో సొప్పో చేసి మరీ కొంటుంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. ఇదంతా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారామనే అభిప్రాయాలు ఉన్నాయి. పైగా కలిపురుషుడి ఐదు నివాస స్థానాల్లో బంగారం ఒకటని శాస్త్రం చెబుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కంటే దానం చేయడం ఉత్తమమని పండితులు చెబుతుంటారు. అక్షయ తృతీయ రోజు పుణ్యాలే కాదు చేసిన పాపాలు సైతం అక్షయమవుతాయి. ఈ పర్వ దినం రోజున ఓ కొత్త కుండలో కానీ కూజాలో కానీ మంచి నీరు పోసి దాహార్తులకు శ్రద్ధతో సమర్పిస్తే.. విశేష ఫలితం దక్కుతుంది. ఆకలితో ఉన్నవారికి పెరుగన్నంతో కూడిన భోజం పెడితే జన్మ జన్మలకూ ఆకలి బాధలు లేకుండా పోతాయి. వస్త్రాలు, గొడుగులు, చెప్పులు, విసన కర్రలు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అర్హులకు స్వయం పాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పిస్తే ఉత్తర జన్మల్లో ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది. గోధుమలు, ధాన్యం, పప్పు దినుసులు సైతం దానం చేయొచ్చు.

ఏ దేవుడిని ఎలా పూజించాలి.?

పార్వతీ దేవికి పరమేశ్వరుడు అక్షయ తృతీయ వ్రత విధానాన్ని వివరించాడు. ఉదయాన్ని నిద్ర లేచి, తలంటు స్నానం చేసి విష్ణువును పూజంచాలి. పూజకు శ్రుభమైన ప్రదేశాన్ని ఎంచుకుని పీట వేసి దానిపై కొత్త వస్త్రాన్ని పరిచి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా పసుపు వినాయకుడిని చేసుకుని పూజించి..తర్వాత విష్ణువును షోడశోపచాలతో ఆరాధించాలి. శక్తి మేరకు పాయస, పరమాన్నాలను నివేదించాలి. పూజాక్షితలు తలపై జల్లుకోవాలి. శివుడిని ప్రార్థించి కుబేరుడు వరం పొందిన రోజు కూడా అక్షయ తృతీయే. దాంతో లక్షీ కుబేరులను పూజించే సంప్రదాయం కూడా ఉంది. కుబేర లక్షీ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అమ్మవారిఅనుగ్రహం లభిస్తుంది. కొన్ని చోట్ల వైశాఖ పూజ చేస్తారు. మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగు, మామిళిపళ్లు, గంధం, జలంతో ఉన్న భాండాన్ని ధానం చేస్తారు. ఎండలు మండిపోయే వైశాఖ మాసంలో ఇలాంటి దానాలు చేస్తే పుణ్యం అక్షయమవుతుంది. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలే సంప్రదాయం కూడా ఉంది. అలా చేస్తే పితృదేవతలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. అన్నపూర్ణా దేవి అవతారాన్ని స్వీకరించిన రోజు కావడం శక్తి పూజ విశేష ఫలితాన్నిస్తుంది. గౌరీ దేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.

Also Read: NBK 107 Title: బాల‌కృష్ణ తదుపరి సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌.. ఇక అభిమానులకు పూనకాలే!

Also ReadNarayana On Ktr: మోడీ వల్లే కేటీఆర్ మాట మార్చారు.. సీపీఐ నారాయణ సంచలనం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News