Shani Jayanti 2023: శని జయంతి నాడు అరుదైన యాదృచ్ఛికం.. ఇలా చేస్తే మీ కష్టాలు మటుమాయం..

Shani Jayanti 2023 date: ఇవాళే శని జయంతి. ఈరోజున శనిదేవుడికి పూజలు చేయడం వల్ల మీ బాధలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా మీకు దేనికీ లోటు ఉండదు. శని జయంతి రోజున శనిదేవుడిని ఏ సమయంలో పూజించాలో తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 19, 2023, 07:24 AM IST
Shani Jayanti 2023: శని జయంతి నాడు అరుదైన యాదృచ్ఛికం.. ఇలా చేస్తే మీ కష్టాలు మటుమాయం..

Shani Jayanti 2023 Significance: గ్రంథాల ప్రకారం, సూర్యదేవుడు మరియు ఛాయాల కుమారుడు శనిదేవుడు. ఇతడు జ్యేష్ఠ మాసంలోని అమావాస్య నాడు జన్మించాడు. అందుకే ఈ రోజు అంటే మే 19న శని జయంతి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున మీరు శనిదేవుడికి పూజలు చేస్తే మీ బాధలన్నీ పోయి.. మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీకు దేనికీ లోటు ఉండదు. అంతేకాకుండా మీరు మానసిక మరియు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. 

పూజ ముహూర్తం
పంచాంగం ప్రకారం, ఈసారి అమావాస్య తిథి మే 18 రాత్రి 09.42 గంటలకు ప్రారంభమై.. మే 19 రాత్రి 9.22 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, ఈ సంవత్సరం శని జయంతిని మే 19 శుక్రవారం జరుపుకోనున్నారు. ఈ రోజున శని దేవుడిని పూజించడానికి అనుకూలమైన సమయం రాత్రి 9.30 గంటల వరకు ఉంటుంది.

శుభ యాదృచ్ఛికం
శని జయంతి నాడు కొన్ని శుభ యాదృచ్చిక సంఘటనలు జరుగుతున్నాయి. 30 ఏళ్ల తర్వాత శని జయంతి రోజున శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈరోజు కృత్తిక నక్షత్రం కూడా ఉంది. ఈరోజున కొన్ని పరిహారాలు చేయడంతోపాటు శనిదేవుడి మంత్రాలు పఠించడం వల్ల మీ అన్ని దుఃఖాలు తొలగిపోతాయి.

శనిదేవుడిని  ఇలా పూజించండి
శని జయంతి రోజున శనిదేవుడి ఆలయానికి వెళ్లి ఆ దేవుడిని దర్శించుకోండి. తర్వాత శనిదేవుడిని  ఆవనూనెతో అభిషేకించాలి. అనంతరం శని దేవుడికి నల్ల నువ్వులు, ఉరద్ పప్పు, నీలం పువ్వులు మరియు నీలిరంగు వస్త్రాలు సమర్పించండి. ఆవనూనె దీపం వెలిగించి 'ఓం శం శనైశ్చరాయ నమః' అనే మంత్రాన్ని జపించండి. ఈరోజు శని చాలీసా మరియు శని కవచాన్ని పఠించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. చివరగా శనిదేవుడి హారతి ఇచ్చి అవసరమైన వారికి దానం చేయండి. 

Also Read: Vat Savitri Vrat 2023: వటసావిత్రీ వ్రత ప్రాముఖ్యత, పూజా నియమాలు, ఆచరించడం వల్ల కలిగే లాభాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News