Janmashtami 2022: జన్మాష్టమి రోజు రాత్రి తిరోగమనం చెందిన 4 పెద్ద గ్రహాలు.. ఈ రాశులవారు జాగ్రత్త!

Janmashtami 2022: జన్మాష్టమి రోజు రాత్రి 4 పెద్ద గ్రహాలు తిరోగమనం చెందాయి. ఈ సమయంలో ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 20, 2022, 08:11 AM IST
Janmashtami 2022: జన్మాష్టమి రోజు రాత్రి తిరోగమనం చెందిన 4 పెద్ద గ్రహాలు.. ఈ రాశులవారు జాగ్రత్త!

Krishna Janmashtami 2022: దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి (Janmashtami) వేడుకలు చాలా వైభవంగా జరిగాయి. ప్రతి ఇంట్లో చిన్ని కృష్ణుడు సందడి చేశాడు. మన తెలుగు లోగిళ్లలో కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉట్టి కొట్టడం, ముగ్గులు పెట్టడం వంటి కార్యక్రమాలు చేశారు. ఆస్ట్రాలజీ ప్రకారం, నిన్న రాత్రి 4 పెద్ద గ్రహాలైన శని, గురు గ్రహాలతో పాటు రాహు, కేతువులు తిరోగమనం చెందాయి. వీటి ప్రభావం మెుత్తం 12 రాశుల మీద ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశులవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 

ఈ రాశుల వారు జాగ్రత్త
మేషం (Cancer)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పాప గ్రహం రాహువు మేషరాశిలో సంచరించాడు. ఈ సమయంలో ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పిల్లల గురించి ఆందోళన ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాలలో కూడా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

కర్కాటకం (Cancer)- జన్మాష్టమి రోజు రాత్రి 4 పెద్ద గ్రహాల తిరోగమనం కారణంగా... కర్కాటక రాశి వారికి ఈ సమయం కష్టంగా ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం ముఖ్యం. ఇలా చేయకపోతే నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. డబ్బు దుబారా అవుతుంది. 

ధనుస్సు (Sagittarius)- ఆస్ట్రాలజీ ప్రకారం, ఈ రాశి వారు డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి, లేకుంటే తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ప్రేమ విషయంలో చాలా అడ్డంకులు ఎదురవుతాయి. ఈ సమయంలో విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు లక్ష్యాన్ని సాధించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Also Read: Horoscope Today August 20th : నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశి వారిని నెగటివిటీ వెంటాడుతుంది... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News