Four Rajyog In Kundli: గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మార్చడం ద్వారా అరుదైన రాజయోగాలు ఏర్పడతున్నాయి. ఈ యోగాల ప్రభావం కొంత మందికి ప్రతికూలంగానూ మరియు కొందరికి అనుకూలంగానూ ఉంటుంది. 20 ఏళ్ల తర్వాత నాలుగు రాజయోగాలు ఏర్పడనున్నాయి. అవే సత్కీర్తి, హర్ష, భారతి మరియు వర్షిత్. ఈ రాజయోగాలు అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ఇది మూడు రాశులవారికి పురోభివృద్ధితోపాటు లాభాలను ఇస్తుంది.
మకర రాశిచక్రం
ధనరాజయోగం ఈ రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఆఫీసులో మీరు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. ఆర్థికంగా మీరు లాభపడతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు లాభాలను గడిస్తారు. వివాహం కానీవారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. బిజినెస్ విస్తరిస్తుంది.
మిథున రాశిచక్రం
నాలుగు రాజయోగాలు ఏర్పడటం వల్ల మిథున రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. వ్యాపార నిమిత్తం మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల కల నెరవేరుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.
కన్య రాశిచక్రం
ధన రాజయోగం మీకు ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి 15 తర్వాత మీ జాతకంలో మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీనితో పాటు శని దేవుడు మీ రాశి నుండి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి.
Also Read: Surya Gochar 2023: 30 ఏళ్ల తర్వాత కుంభంలో శని, సూర్యుని కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Rajyog In Kundli: 20ఏళ్ల తర్వాత 4 ధన రాజయోగాలు.. ఈ 3 రాశులకు ధనప్రాప్తి..