Grah Gochar on July1st 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. జూలై మెుదటి వారంలో మూడు పెద్ద గ్రహాల గమనంలో మార్పు రాబోతుంది. అంగారకుడు, బుధుడు మరియు శుక్రుడు తమ తమ రాశులను మార్చబోతున్నారు. జూలై 01న కుజుడు, జూలై 07న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తారు. జూలై 08న గ్రహాల యువరాజు బుధుడు కర్కాటక రాశిలోకి వెళ్తాడు. గ్రహాల యెుక్క రాశి మార్పు నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
గ్రహాల సంచారం ఈ రాశులకు వరం
మిధునరాశి
శుక్రుడి రాశి మార్పు కారణంగా మిథునరాశి వారు మంచి లాభాలను పొందుతారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు.
మేషరాశి
మేష రాశి వారికి అంగారకుడి సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు కెరీర్లో మంచి పురోగతిని సాధిస్తారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీరు వృత్తి, వ్యాపార మరియు ఉద్యోగాల్లో విజయం సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
తులారాశి
జూలైలో గ్రహాల సంచారం తుల రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శుక్రుని సంచారం ఈ రాశివారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కోరుకున్న ధనం మీకు అందుతుంది. మీకు అదృష్టం తోడై.. ప్రతి కార్యాన్ని విజయవంతంగా పూర్తిచేస్తారు.
Also Read: Budh Gochar 2023: ఈ రోజు నుండి ఈ రాశుల వారి అదృష్టం మారనుంది.. మీరున్నారా?
సింహరాశి
సింహ రాశి వారికి శుక్రుని సంచారం మేలు చేస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కెరీర్ లో ముందుకు సాగుతారు. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు ధనలాభం ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది.
Also Read: Vakri Shani 2023: త్రికోణ రాజయోగంతో ఈ 5 రాశులవారికి లాభాలే లాభాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook