Planet Changes November 2022: నవంబర్‌లో 5 గ్రహాల రాశి మార్పు... ఈ రాశులకు ప్రత్యేకమైన ప్రయోజనం..

Planet Changes 2022: నవంబర్ నెల కొన్ని రాశుల వారికి చాలా మంచిది. ఈ నెలలో ఐదు గ్రహాలు రాశిచక్రాన్ని మార్చబోతున్నాయి. దీని వల్ల ఐదు రాశుల వారికి బలమైన ప్రయోజనాలు లభిస్తాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2022, 04:19 PM IST
Planet Changes November 2022: నవంబర్‌లో 5 గ్రహాల రాశి మార్పు... ఈ రాశులకు ప్రత్యేకమైన ప్రయోజనం..

Planet Changes in November 2022: ఎల్లుండి నుంచి నవంబరు నెల ప్రారంభం కానుంది. ఈ నెలలో 5 గ్రహాలు తమ రాశిచక్రాన్ని మార్చబోతున్నాయి. నవంబరు 8న మేషరాశిలో ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. నవంబర్ 11న శుక్రుడు వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు. నవంబర్ 13న కుజుడు మిథునరాశి నుండి వృషభరాశికి తిరోగమన స్థితిలో ప్రయాణిస్తాడు. నవంబర్ 13న బుధుడు కూడా వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు. నవంబర్ 16న సూర్యుడు వృశ్చికరాశిలో సంచరిస్తాడు. అదే సమయంలో నవంబర్ 24 న, బృహస్పతి తన గమనాన్ని తిరోగమనం నుండి మార్గంలోకి వస్తాడు. ఈ గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశులవారికి మేలు జరగునుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మిధునరాశి (Gemini): గ్రహాల రాశి మార్పు కారుణంగా మిథునరాశివారికి అపారమైన ప్రయోజనం కలుగనుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. పనిలో సీనియర్లు సపోర్టు లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది. ఉద్యోగాన్ని మారాలనుకునేవారికి ఇదే మంచి సమయం. 
సింహం (Leo): సింహ రాశి వారు కెరీర్‌లో విజయాన్ని సాధిస్తారు. ధనలాభం ఉంటుంది. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నవంబర్‌లో గ్రహాల రాశి మార్పు వల్ల వ్యాపారవేత్తలు భారీ లాభాలను పొందుతారు. ఇల్లు కొనాలన్న కల నెరవేరుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి నవంబర్ లాభిస్తుంది. మీడియా మరియు సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు సరైన ఫలితాలను పొందుతారు. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది. 
కన్య (Virgo): ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది.  ఉద్యోగాల కోసం చూస్తున్న వ్యక్తుల అన్వేషణ ఫలిస్తుంది. కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ ఫర్ కావాలని ఆలోచిస్తున్న ఉద్యోగుల కల నెరవేరుతుంది. ప్రతి పనిలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలను ఇస్తుంది.  
మకరరాశి (Capricorn): మకర రాశి వారికి కెరీర్ పరంగా ఈ మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది. గ్రహ సంచారం ద్వారా ప్రతి పని పూర్తి అవుతుంది. ఆదాయం ఎక్కువ మరియు ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగార్థులు, వ్యాపారస్తులు అధిక లాభాలను ఆర్జిస్తారు.

Also Read: November Festivals list 2022: నవంబర్‌లో వచ్చే పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News