Women Sits In Pothole: ముందే అధ్వానమైన రోడ్డు. ఆపై వర్షం పడడంతో రోడ్డుపై ఉన్న గుంతల్లో నీరు చేరి ప్రమాదకరంగా మారింది. తరచూ ఇక్కడ వాహనదారులు, పాదచారులు ప్రమాదానికి గురవుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. నెలలు.. వారాలు గడిచినా పట్టించుకోకపోవడంతో ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల తీరుకు నిరసనగా మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుంది. రోడ్డుపై నిలిచిన నీటి గుంతలో ఆమె నిరసన దిగింది. ఇది కాస్త సోషల్ మీడిమాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
Also Read: Snake Bite: తలుపు చాటున నక్కిన అత్యంత విషపూరిత పాము.. చటుక్కున కాటేసింది
నాగోల్ ఆనంద్ నగర్ ప్రధాన రహదారి అధ్వానంగా ఉంది. గుంతలతో రోడ్డుపై వాహనాల రాకపోకలు చేయలేని పరిస్థితి. తరచూ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు ఎవరూ స్పందించడం లేదు. రోడ్డు సమస్యపై కొందరు ఆన్‌లైన్ వేదికగా ఫిర్యాదు చేశారు. మరికొందరు కార్యాలయానికి వెళ్లి విన్నించారు. అయినా స్పందించలేదు. దీంతో ఇక్కడి స్థానికురాలు రోడ్డుపై నీటితో ఉన్న గుంతలో ఆమె కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
Also Read: Snake Cremation: వింత ఘటన.. పాడె కట్టి ఊరేగించి పాముకు అచ్చం మనిషికి చేసినట్టు అంత్యక్రియలు
అలా కొన్ని గంటల పాటు నీటిలో కూర్చున్న అధికారుల అలసత్వాన్ని ఎత్తిచూపారు. ఎలాంటి నినాదాలు.. ప్లకార్డులు ప్రదర్శించకుండా మౌనంగా ఆమె నిరసన చేశారు. పాలకుల నిర్లక్ష్యాన్ని తన మౌన నిరసనతో మహిళ ప్రపంచానికి చూపించారు. ఆమె నిరసన చేస్తున్న ఫొటోలు, వీడియోలు ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. ఆమె చేస్తున్న పోరాటానికి నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆమె ఎత్తి చూపారని కొనియాడుతున్నారు.
అకాల వర్షాలతో హైదరాబాద్ ప్రజలు తరచూ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు విద్యుత్ కోతలతో నరకం అనుభవిస్తున్నారు. వీటన్నిటినీ గుర్తు చేస్తూ నెటిజన్లు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. సమస్యలు పరిష్కరించని జీహెచ్‌ఎంసీ అధికారులపై మండిపడుతున్నారు. నీ పోరాటం విజయవంతం కావాలి అని మరికొందరు ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే నిరసనకు దిగిన ఆ మహిళ వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఆమె ఎవరు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter