Woman Dance Viral Video: డ్యాన్స్ చేస్తోన్న యువతి వెనకాలే వచ్చి ఎంత పని చేశాడు.. వీడియో వైరల్

Woman Dance Video Goes Viral: ఇటీవల కాలంలో నడిరోడ్లపై పబ్లిక్ అంతా కళ్లప్పగించి చూస్తుండగా డ్యాన్స్ చేసి ఆ వీడియోను రీల్స్‌గా పోస్ట్ చేసి సోషల్ మీడియాలో పాపులారిటీ పొందడం సర్వసాధారణమైంది. నిత్యం ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంటాయి. కానీ ఈ వీడియో మాత్రం అందుకు కొంచెం భిన్నమైంది.

Written by - Pavan | Last Updated : Oct 9, 2022, 01:30 AM IST
Woman Dance Viral Video: డ్యాన్స్ చేస్తోన్న యువతి వెనకాలే వచ్చి ఎంత పని చేశాడు.. వీడియో వైరల్

Woman Dancing on Street Viral Video: ఇన్‌ఫ్లూయెన్సర్స్ డాన్స్ చేస్తుండగా ప్రత్యక్షంగా చూసేవాళ్లలో కొందరికి అది వినోదంగా భావించి ఎంజాయ్ చేస్తే.. ఇంకొత మందికి అదొక పబ్లిక్ న్యూసెన్స్‌లా కనిపించి చిరాకు తెప్పిస్తుంటాయి. అయితే, ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలి కానీ.. సోషల్ మీడియాలో ఈ వీడియోలకు మంచి ఆదరణ కనిపిస్తోంది.  

సోషల్ మీడియాలో వస్తున్న భారీ రెస్పాన్స్ ని క్యాష్ చేసుకోవడం కోసం ఇన్ ఫ్లూయెన్సర్స్ చేస్తోన్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.. ఇదిగో ఇక్కడ ఇప్పుడు మనం చూడబోతోన్న వీడియో కూడా అలాంటిదే. ఒక యువతి సుష్మితా సేన్ నటించిన దిల్బర్ సాంగ్ పై హోయలొలికిస్తూ మార్కెట్ ఏరియాలో డ్యాన్స్ చేసింది. ఆమె కష్టానికి తగినట్టుగానే ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

అయితే ఈ వీడియో వైరల్ అవడానికి మాత్రం కారణం ఆమె కాదట... ఆ క్రెడిట్ మొత్తం కొట్టేసిన హీరో ఎవరో కాదు... ఆ యువతి వెనకాలె ఆమెను ఇమిటేట్ చేస్తూ డాన్స్ చేసిన వ్యక్తి వల్లే ఈ వీడియోకు ఇంత క్రేజ్ వచ్చిందంటున్నారు నెటిజెన్స్. సదరు వ్యక్తి కూడా అచ్చం ఆ యువతిని ఇమిటేట్ చేసేందుకు తెగ ప్రయత్నించాడు. శరీరాన్ని ఆమెలాగే నాజూగ్గా తిప్పుతూ తన బాడీలో కూడా ఓ రిథం ఉందని నిరూపించుకున్నాడు.

ఇలాంటి వాళ్ల వల్ల రోడ్డు పక్కన ఉండే వారికి కూడా వినోదం పంచుకునేందుకు కంపెనీ దొరుకుతోందని ఓ నెటిజెన్ ట్వీట్ చేస్తే.. ఆమె వెనకాల ఆమెను ఇమిటేట్ చేస్తున్న వ్యక్తే ఆమె కంటే బాగా డాన్స్ చేస్తున్నాడని మరో నెటిజెన్ కౌంటర్ వేశాడు. మొత్తానికి వీడియో మాత్రం ఆశించినట్టే వైరల్ అయ్యింది.

Also Read : Chikni Chameli Song: క్లాస్ రూమ్‌లో చికినీ చమేలీ డాన్స్.. తరగతి గదిలో తోటి విద్యార్థుల ముందు ఇవేం వేషాలు

Also Read : 5G Network Activation: మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G నెట్‌వర్క్ యాక్టివేట్ చేసుకోండిలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News