Facebook Outage: ఫేస్‌బుక్ సేవలు ఆగడానికి కారణం ఎవరు, అందరూ ఊహించింది కాదా, భారీ నష్టమేనా

Facebook Outage: ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టా సేవలు 7 గంటలపాటు నిలిచిపోయి..ఆ సంస్థలకు భారీ నష్టాన్నే చేకూర్చాయి. అందరూ అనుకున్నట్టు సర్వర్ డౌన్ లేదా హ్యాకింగ్ కారణం కాదు. ఓ వ్యక్తి పొరపాటే దీనికి కారణంగా, భారీ నష్టానికి మూలంగా తెలుస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 5, 2021, 10:38 AM IST
  • ఫేస్‌బుక్ , వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు అగిపోడానికి కారణమెవరు
  • సర్వర్ డౌన్ సమస్య కాదా...ఓ వ్యక్తి పొరపాటు కారణమా
  • సేవల విఘాతంతో ఫేస్‌బుక్ సంస్థకు 50 వేల కోట్ల నష్టం
Facebook Outage: ఫేస్‌బుక్ సేవలు ఆగడానికి కారణం ఎవరు, అందరూ ఊహించింది కాదా, భారీ నష్టమేనా

Facebook Outage: ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టా సేవలు 7 గంటలపాటు నిలిచిపోయి..ఆ సంస్థలకు భారీ నష్టాన్నే చేకూర్చాయి. అందరూ అనుకున్నట్టు సర్వర్ డౌన్ లేదా హ్యాకింగ్ కారణం కాదు. ఓ వ్యక్తి పొరపాటే దీనికి కారణంగా, భారీ నష్టానికి మూలంగా తెలుస్తోంది.

అక్టోబర్ 4వ తేదీ సోమవారం రాత్రి. మార్క్ జుకర్‌బర్గ్‌కు(Mark Zuckerberg)అత్యంత చేదైన రోజు. సంస్థ ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఎదురుకాని అతి భారీ నష్టం. వాట్సప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ దాదాపు 7 గంటలసేపు నిలిచిపోయిన పరిస్థితి. తిరిగి ఇవాళ ఉదయం 4 గంటల ప్రాంతంలో ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టా‌గ్రామ్ సేవలు రీస్టోర్ అయ్యాయి. అయితే ఈ బ్రేక్‌డౌన్ కారణంగా ఫేస్‌బుక్ సంస్థకు ఏకంగా 50 వేల కోట్లు నష్టం కలిగినట్టు అంచనా. ఫేస్‌బుక్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రపంచం మొత్తం మీద ఇంతసేపు సేవలు(Facebook Outage) నిలిచిపోవడం, భారీ నష్టం కలగడం ఇదే తొలిసారి. ఫలితంగా అపర కుబేరులా జాబితాలో మార్క్ జుకర్‌బర్గ్ స్థానం కూడా కిందకు పడిపోయింది. సెప్టెంబర్ మధ్యలోంచి ఫేస్‌బుక్ స్టాక్ 15 శాతం పడిపోగా, సేవలు నిలిచిపోవడంతో మరో 5 శాతం పడిపోయిందని బ్లూమ్‌బర్ల్ బిలియనీర్స్ ఇండెక్స్(Bloomberg Billionaired Index) తెలిపింది. ఈ నష్టం కారణంగా మార్క్ జుకర్‌బర్గ్ ప్రస్తుతం 12.9 బిలియన్ డాలర్లతో 5వ స్థానం నుంచి ఆరవ స్థానానికి చేరాడు. 

ఇంతలా సేవలు నిలిచిపోవడానికి కారణం సర్వర్ డౌన్ అని తొలుత అంచనా వేశారు కానీ అసలు కారణం వేరే అని తెలుస్తోంది.ఫేస్‌బుక్ అనుబంధ సర్వీసులు నిలిచిపోవడంతో(Reason for Facebook Outage)యూజర్ల అసహనం, వివిధ రకాల మీమ్స్ ప్రచారమయ్యాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్(Wall Street Journal)నెగెటివ్ కధనాల ప్రభావం లేదా హ్యాకర్ల పనిగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇదేమీ కాదని..అలాగని సర్వర్ డౌన్ కూడా కాదని తేలింది. సాంకేతిక పరమైన సమస్యే కారణమని..ఒక వ్యక్తి పొరపాటు వల్లే ఇదంతా జరిగిందని తెలుస్తోంది. డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది ఇంటర్నెట్‌కు ఫోన్‌బుక్ వంటిది. ఇందులో సమస్య తలెత్తిందని తొలుత భావించారు. కానీ తరువాత బీజీపీ అంటే బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్‌ను ఓ ఉద్యోగి మ్యాన్యువల్‌గా అప్‌లోడ్ చేయడం వల్లనే సమస్య వచ్చిందని తెలిసింది. బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్(Border gateway protocol)అనేది గేట్‌వే ప్రోటోకాల్‌ను సూచిస్తుంది. ఇది స్వయం ప్రతిపత్తి వ్యవస్థల రూటింగ్ సమాచారాన్ని మార్పిడి చేసేందుకు ఇంటర్నెట్‌కు అనుమతిస్తుంది. ఆ వ్యక్తి మ్యాన్యువల్ అప్‌లోడింగ్ కారణంగా ఇంతటి భారీ సమస్య తలెత్తినట్టు సమాచారం. అయితే ఆ ఉద్యోగి ఎవరు, ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనేది ఇంకా స్పష్టత రాలేదు. అంతకుమించి ఆ వ్యక్తి చేసింది పొరపాటా లేదా కావాలని చేశాడా అనేది తేలాల్సి ఉంది. బీజీపీ రూట్స్‌లో(BGP Routes)సర్వీసులకు విఘాతం కారణంగా ఫేస్‌బుక్‌కు సంబంధించిన ప్రతి వ్యాపారం ఘోరంగా (Loss to Facebook)దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఫేస్‌బుక్ ఉద్యోగుల యాక్సెస్ కార్డులు కూడా కొన్నిగంటలు పనిచేయలేదని సమాచారం. కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ హెడ్ ఆఫీసు బయటే సిబ్బంది ఉండిపోయారని తెలుస్తోంది. 

Also read: Facebook, Whatsapp, Instagram Services Restored: 7 గంటల అనంతరం రీస్టోర్ అయిన సేవలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News