Whatspp Privacy Policy: ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమమైన వాట్సప్ ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీ వివాదాస్పదమైంది. ప్రైవసీ పాలసీపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతున్న నేపధ్యంలో వాట్సప్ కీలక వివరణ ఇచ్చింది.
వివాదాస్పదమైన వాట్సప్ ప్రైవసీ పాలసీ(Whatsapp Privacy Policy)పై వివరణ వచ్చింది. వినియోగదారులకు శుభవార్త విన్పించింది. వాట్సప్ ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పుడు వాట్సప్ ఈ విషయంలో గుడ్‌న్యూస్ అందించింది. వివాదాస్పదమైన ప్రైవసీ పాలసీను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు (Data Protection Bill) అమల్లోకి వచ్చేవరకూ ప్రైవసీ పాలసీని నిలిపివేసేందుకు అంగీకరిస్తున్నట్టు వెల్లడించింది. కొత్త ప్రైవసీ విధానాల్ని అంగీకరించాలంటూ వినియోగదారులపై ఒత్తిడి తీసుకురామని ఢిల్లీ హైకోర్టుకు (Delhi High Court) వివరించింది. ప్రైవసీ పాలనీకు సంబంధించిన అప్డేట్స్ ఇకపై వినియోగదారులకు కన్పించవని స్పష్టం చేసింది. డేటా పరిరక్షణ బిల్లు వచ్చేవరకూ పాత ప్రైవసీ విధానానికే కట్టుబడి ఉన్నామని తెలిపింది. వాట్సప్ తీసుకున్న ఈ నిర్ణయంతో వినియోగదారులకు గొప్ప ఊరట లభించినట్టైంది.
Also read: Block Your Number: మీ మొబైల్ నెంబర్‌ను బ్లాక్ చేసుకున్నారా, Caller IDని ఇలా హైడ్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook