Whatsapp New Feature: వాట్సప్‌లో త్వరలో మరో సరికొత్త ఫీచర్, అడ్మిన్లదే ఆ అదికారమిక

Whatsapp New Feature: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. వాట్సప్ గ్రూపుల్లో అడ్మిన్స్ కోసం ఈ ఫీచర్ రానుంది. ఎప్పటికప్పుడు వివిధ ఫీచర్లు ప్రవేశపెడుతున్న వాట్సప్..కొత్త ఫీచర్ మాత్రం కచ్చితంగా ప్రయోజనమే.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 29, 2022, 01:47 PM IST
Whatsapp New Feature: వాట్సప్‌లో త్వరలో మరో సరికొత్త ఫీచర్, అడ్మిన్లదే ఆ అదికారమిక

Whatsapp New Feature: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. వాట్సప్ గ్రూపుల్లో అడ్మిన్స్ కోసం ఈ ఫీచర్ రానుంది. ఎప్పటికప్పుడు వివిధ ఫీచర్లు ప్రవేశపెడుతున్న వాట్సప్..కొత్త ఫీచర్ మాత్రం కచ్చితంగా ప్రయోజనమే.

నిత్య జీవితంలో ఓ భాగంగా మారిన వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు (Whatsapp new feature)ప్రవేశపెడుతోంది. గతంలో వాయిస్ మెస్సేజ్ ప్రివ్యూ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. వాట్సప్ గ్రూపుల్లో అడ్మిన్లుగా ఉన్నవారికి మాత్రమే వాట్సప్ కొత్త ఫీచర్ వర్తిస్తుంది. మీరు ఒకవేళ ఏదైనా వాట్సప్ గ్రూపుకు అడ్మిన్‌గా ఉన్నట్టయితే..ఈ కొత్త ఫీచర్ మీకు పూర్తిగా ప్రయోజనకరం. ఎందుకంటే వాట్సప్ గ్రూపుల్లో చాలా రకాల పోస్టింగులు వస్తుంటాయి. కొన్ని కొందరిని ఇబ్బంది కల్గించేవిగా ఉంటాయి. ఇంకొన్ని సంఘ వ్యతిరేక పోస్టింగులు కూడా కావచ్చు. గ్రూప్ అడ్మిన్‌గా మీరుంటే అది పరోక్షంగా మీ బాథ్యతకు దారి తీస్తుంది. 

ఇటువంటి పరిస్థితుల్లో అడ్మిన్‌కు ఓ ప్రత్యేక అధికారం కల్పిస్తే బాగుంటుందనేది వాట్సప్ ఆలోచనగా ఉంది. ఎవరైనా పెట్టిన పోస్టును వెంటనే గంట 8 నిమిషాల పదహారు సెకన్లలోగా వారే స్వయంగా తొలగించగలిగే.. డిలీట్ మెస్సేజ్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ గురించి అందరికీ తెలుసు. ఇదే ఫీచర్‌ను గ్రూపు అడ్మిన్లకు కల్పించే ఫీచర్ ఇది. ఈ కొత్త ఫీచర్ త్వరలో అందుబాటులో రానుంది. దీని ప్రకారం గ్రూపులో ఎవరు పెట్టిన పోస్ట్ అయినా సరే..ఎవరికీ కన్పించకుండా డిలీట్ మెస్సేజ్ ఎవ్రీ వన్ ఆప్షన్ ద్వారా తొలగించే అదికారం అడ్మిన్‌కు వస్తుంది. గ్రూపులో ఒకరి కంటే ఎక్కువ అడ్మిన్లు ఉన్నా సరే..అందరికీ ఈ ఫీచర్ వర్తిస్తుంది. ఈ ఆప్షన్ త్వరలో వాట్సప్ (Whatsapp) బీటా యూజర్లకు అందుబాటులో రానుంది. గ్రూపు ఉద్దేశ్యానికి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టింగులు పెట్టినప్పుడు ఆ గ్రూపు అడ్మిన్ వెంటనే ఆ మెస్సేజ్‌ను తొలగించవచ్చు. మరోవైపు వాట్సప్‌లో ఉన్న డిలీట్ ఎవ్రీ వన్ మెస్సేజ్ సమయాన్ని 7 రోజులకు పెంచేందుకు వాట్సప్ యోచిస్తోంది. 

Also read: Cheetah: మూడు తలల చిరుత.. మంత్ర ముగ్ధులను చేస్తోన్న అతని ఫోటోగ్రఫీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News