Python Viral Video: వామ్మో!! 20 అడుగుల భారీ కొండచిలువ మనిషిని ఎలా నలిపేస్తుందో చూడండి

Python Attacks Man: కొండచిలువలు విషపూరితమైన సర్పాలు కాకపోయినా.. అంతకంటే భయంకరమైనవి. విషపూరితమైన సర్పాలు కాటేసి చంపేస్తే.. భారీ కొండచిలువలు ఏ జీవినైనా కదలకుండా బలంగా చుట్టేసి, ఊపిరాడకుండా చేసి చంపేసి మింగేయగలవు.

Written by - Pavan | Last Updated : Nov 6, 2022, 06:51 AM IST
Python Viral Video: వామ్మో!! 20 అడుగుల భారీ కొండచిలువ మనిషిని ఎలా నలిపేస్తుందో చూడండి

Python Attacks Man: కొండచిలువ ఎంత పెద్దదయితే.. దానితో అంత ప్రమాదం పొంచి ఉంటుందనే విషయం తెలిసిందే. కాకపోతే మిగతా సర్పాల మాదిరిగా కొండ చిలువలు వేగంగా కదలలేవు. కానీ ఒకవేళ తనకు అందేంత దూరంలో ఉన్న ఏ జీవినైనా ఇవి అంత ఈజీగా విడిచిపెట్టవు. అందుకే కొండ చిలువలను చూస్తే ఎరైనా దూరం జరగాల్సిందే.. లావుగా, పొడవుగా పెరిగే పాముల్లో కొండచిలువ ముందుంటుంది.   

ఇదిగో ఈ వీడియో చూడండి.. స్నేక్ బైట్స్ టీవీ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో 20 అడుగులకు పైగా పెద్దగా ఉండే భారీ కొండచిలువ తన కేర్ టేకర్ ని గట్టిగా చుట్టేయడం చూడొచ్చు. కొండచిలువను మోసుకొచ్చి బోనులో వేయబోతుండగా అది అతడిని గట్టిగా చుట్టేసి ఊపిరాడకుండా చేస్తోంది. ఈ భారీ ఆడ కొండచిలువ పేరు లూసీ. ఈ జూ పార్కులో ఈ కొండచిలువను హ్యాండిల్ చేస్తోన్న వ్యక్తి పేరు బ్రియన్ బర్జిక్. 

మాములుగా అయితే, లూసీ లాంటి భారీ కొండచిలువను చూస్తే ఎవరైనా దూరంగా పరిగెత్తాల్సిందే. కానీ బ్రియన్ బతుకుదెరువే లూసీ బాగోగులు చూడటం కావడంతో అతడు నిత్యం ఆ కొండచిలువతోనే స్నేహం చేయకతప్పని పరిస్థితి. ఈ కొండచిలువను హ్యాండిల్ చేయడం కత్తిమీద సాములాంటిదని చెబుతున్నాడు లూసీ బాగోగులు చూస్తోన్న బ్రియన్. ఇంతపెద్ద పాముకు ఉండే శక్తి గురించి మాటల్లో చెప్పలేం అంటున్న బ్రియన్ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by B R I A N B A R C Z Y K (@snakebytestv)

 

ప్రస్తుతం బ్రియాన్ బర్జిక్ వయస్సు  50 ఏళ్లు. మిచిగాన్‌కి చెందిన బ్రియాన్ నిత్యం తాను హ్యాండిల్ చేసే పాములతో పాటు ఇతర జీవుల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జీవనాధారంతో పాటు జనాధరణ కూడా పొందుతున్నాడు. అంటే డబ్బుకు.. డబ్బు.. ఫాలోవర్లకు ఫాలోవర్లు అన్నమాట. బ్రియాన్ పోస్ట్ చేసిన ఈ వీడియో 30 వేల వరకు లైక్స్ సొంతం చేసుకోగా.. 7 లక్షల 40 వేల వ్యూస్ వచ్చాయి.

Also Read : Lizard Eating Watermelon: బల్లితో కలిసి పుచ్చకాయ తింటున్నాడు.. వైరల్ వీడియో

Also Read : Crocodile Attacks Cow: నీళ్లు తాగడానికి వచ్చిన ఆవును పట్టిన మొసలి.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News