Viral Video: క్లీనింగ్ క్లాత్‌తో దొంగను చితగ్గొట్టిన మహిళ, చోరీకి ప్రయత్నించి పలాయనం చిత్తగించిన దొంగ, వీడియో వైరల్

Viral Video: నెదర్లాండ్స్‌లో ఓ మహిళ చూపిన తెగువ, సాహసం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒంటరిగా..తన షాపులో చొరబడిన దొంగను ఎదుర్కొన్న తీరును అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియో వైరల్ అవుతోంది..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 31, 2022, 06:27 PM IST
Viral Video: క్లీనింగ్ క్లాత్‌తో దొంగను చితగ్గొట్టిన మహిళ, చోరీకి ప్రయత్నించి పలాయనం చిత్తగించిన దొంగ, వీడియో వైరల్

Viral Video: నెదర్లాండ్స్‌లో ఓ మహిళ చూపిన తెగువ, సాహసం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒంటరిగా..తన షాపులో చొరబడిన దొంగను ఎదుర్కొన్న తీరును అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియో వైరల్ అవుతోంది..

ఈ వీడియో ద్వారా ఒక విషయం స్పష్టమౌతోంది. ఎప్పుడూ మహిళా శక్తిని, ధైర్యాన్ని, తెగువను తక్కువ అంచనా వేయకూడదు. శ్రీశ్రీ అన్నట్టు కాదేదీ ఆత్మ రక్షణకు అనర్హం. క్లీనింగ్ క్లాత్ అయినా ఫరవాలేదు. అదే జరిగింది. నెదర్లాండ్స్‌లోని ఓ బేకరీలో ఓ మహిళ చూపిన తెగువ, సాహసం అందర్నీ ఆకర్షిస్తోంది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 

నెదర్లాండ్స్‌లోని మేవ్లానా బేకరీ. బేకరీ టర్కిష్ డచ్ మహిళ ఒంటరిగా ఉంది. క్లీనింగ్ క్లాత్‌తో షాపు శుభ్రం చేసుకుంటూ ఉంది. అంతలో నల్ల ముసుగు ధరించిన ఓ దొంగ చొరబడతాడు. నేరుగా కౌంటర్ వద్ద ఉన్న ఆమెను తోసి..కౌంటర్ నుంచి డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అంతలో ఆ మహిళ ఏ మాత్రం భయపడకుండా..తన చేతిలో ఉన్న క్లీనింగ్ క్లాత్‌తోనే ఆ దొంగపై దాడి చేస్తుంది. ఓ చేత్తో క్లీనింగ్ క్లాత్‌తో ఆ దొంగను కొడుతూ..మరో చేత్లో క్లీనింగ్ స్ప్రేతో దాడి చేస్తూ..కాళ్లతో తన్నడం ప్రారంభిస్తుంది. కిందపడేసి మరీ కొడ్తుంటే..ఆ దొంగ తప్పించుకుని ప్రాణాలరచేతిలో పెట్టుకుని పారిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఆ షాపులో వస్తున్న ఓ కస్టమర్ పారిపోతున్న దొంగను అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమౌతాడు. ఈ దృశ్యమంతా సీసీటీవీలో రికార్డవడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది.

చోరీకి ప్రయత్నించి విఫలమై తన్నులు తిన్న ఆ దొంగపై నెటిజన్లు నవ్వుతున్నారు. ఆ మహిళ చూపిన తెగువను ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. 

Also read: Bike Lifting: బైక్‌ని తలపై ఎత్తుకుని.. బస్సు ఎక్కిన రియల్ బాహుబలి! వీడియో చూస్తే ప్రభాస్ కూడా బిత్తరపోతాడు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News