Viral Video: పెను ప్రమాదం నుంచి బిడ్డను కాపాడిన తల్లి.. వీడియో చుస్తే మతిపోవడం పక్కా!

Mother Saves Her Son In Road Accident. ఎదురుగా ఓ భారీ ట్రక్కు వస్తుండడాన్ని గమనించిన తల్లి.. చక్రాల కింద పడిపోబోతున్న కుమారుడిని చాకచక్యంగా వెనక్కి లాగింది. దాంతో తృటిలో ఇద్దరు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 26, 2022, 11:21 PM IST
  • పెను ప్రమాదం నుంచి బిడ్డను కాపాడిన తల్లి
  • వీడియో చుస్తే మతిపోవడం పక్కా
  • తల్లి ప్రేమకు మించింది మరేది లేదు
 Viral Video: పెను ప్రమాదం నుంచి బిడ్డను కాపాడిన తల్లి.. వీడియో చుస్తే మతిపోవడం పక్కా!

Viral Video, Mother Saves Her Son In Road Accident: ఈ భూ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించింది మరేది లేదు. క‌న్న‌పేగుబంధం, అనుబంధానికి సాటి మ‌రేదీ రాదు. పిల్లలను తల్లి ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటుంది. చిన్న సమస్య వచ్చినా తల్లి తట్టుకోలేదు. అలాంటి తల్లి ముందే.. పిల్లలు ఆపదలో ఉంటే ఊరుకుంటుందా? ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతుంది. ఇలాంటి ఘటనే వియాత్నాంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... 

వియాత్నాంలోని నామ్ దిన్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్య, కొడుకుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. రోడ్డుపై వెళుతున్న వారి ద్విచక్ర వాహనంకు కాన్స్ కూడా కట్టుకున్నారు. ఓ కారు వీరి వాహనంను ఓవర్‌టేక్‌ చేస్తూ.. తాకుతూ వెళ్లింది. దీంతో ద్విచక్ర వాహనం వెనక కూర్చున్న తల్లి, కొడుకు కిందపడిపోయారు. అదే సమయంలో ఎదురుగా ఓ భారీ ట్రక్కు వస్తుండడాన్ని గమనించిన తల్లి.. చక్రాల కింద పడిపోబోతున్న కుమారుడిని చాకచక్యంగా వెనక్కి లాగింది. దాంతో తృటిలో ఇద్దరు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంట్రుకవాసిలో తల్లి, కుమారుడు ప్రమాదం నుంచి భయపడ్డారు.  

ఈ ఘటన 2019లోనే జరగ్గా.. ఆ వీడియోను ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ సోమవారం తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. 'మదర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అని ఓ క్యాప్షన్ కూడాఇచ్చాడు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లి చాకచక్య తెలివితేటలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 4.4 మిలియన్ల మంది వీక్షించారు. 'తల్లి ప్రేమకు మించింది మరేది లేదు', 'క‌న్న‌పేగుబంధం అంటే ఇదే మరి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

ఇక గాయాల కారణంగా జోఫ్రా ఆర్చర్‌ ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. రెండు శస్త్రచికిత్సలు చేయించుకున్న ఆర్చర్.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గాయం కారణంగానే ఐపీఎల్ 2022కి ఆర్చర్ దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ రూ.8 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ ఇంగ్లీష్ క్రికెటర్ ముంబై తరఫున బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ టోర్నీ ద్వారానే ఆర్చర్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

Also Read: Bride and Groom Fight: స్టేజ్‌పైనే కొట్టుకున్న వధూవరులు.. కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు!

Also Read: Janhvi Kapoor Hot Pics: ప్రకృతిలో పరవశించిపోతున్న జాన్వీ కపూర్.. హాట్ అందాలు చూస్తే అంతే సంగతులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News