Viral Video: గ్లాసులో వాటర్ తాగుతున్న బ్లాక్ కోబ్రా.. వీడియో చూస్తే చెమటలు పట్టడం ఖాయం

బ్లాక్ కోబ్రా.. చూస్తేనే భయంతో వణికిపోతాము.. అలాంటిది వీడు ఏకంగా దానికి నీళ్లు తాగించాడు.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.. మీరే ఓకే లుక్కేయండి!

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 03:45 PM IST
  • గ్లాసులో నీరు తాగుతున్న బ్లాక్ కోబ్రా
  • నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియో
  • నీరు పట్టిన వ్యక్తిపై దాడి చేయని పాము
Viral Video: గ్లాసులో వాటర్ తాగుతున్న బ్లాక్ కోబ్రా.. వీడియో చూస్తే చెమటలు పట్టడం ఖాయం

Poisonous Black Cobra Drinking Water in a Glass: పాము అని వినగానే చాలా మంది భయాంతో వణికిపోతుంటారు.. అదే మీకు భయంకరమైన నల్లటి నాగుపాము కనపడితే.. ? సాధారణంగా అయితే పాములు కనపడితే భయంతో పరుగులు తీస్తారు.. కదా! అయితే అత్యంత ప్రమాదకరమైన నల్లటి నాగు పాము కనపడితే... పై ప్రాణాలు పైనుండే పోతాయి.. అలాంటిది ఒక వ్యక్తి బ్లాక్ నెక్ స్పిట్టింగ్ కోబ్రాకు గ్లాస్‌లో నీరు పట్టించిన వీడియో నెట్టింలో తెగ వైరల్ అవుతుంది 

గ్లాసులో నీరు తాగుతున్న బ్లాక్ కోబ్రా.. 

వైరల్‌గా మారిన వీడియోలో ఒక వ్యక్తి తన చేతిలో నీటి గ్లాసును పట్టుకున్నట్లు చూడవచ్చు. అదే సమయంలో, అతనికి చాలా దగ్గరగా ఒక నల్ల నాగుపాము కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన వారందరు ఆశ్చర్యపోతున్నారు. పాము ఎంత భయంకరంగా ఉందో వీడియోలో చూడవచ్చు. అయితే నీళ్లు తాగుతున్న ఆ పాము మాత్రం ఆ వ్యక్తిపై ఎలాంటి దాడి చేయలేదు. ఇది భయంకరమైన బ్లాక్ నెక్ స్పిట్టింగ్ కోబ్రా.. ఇది కానీ జస్ట్ టచ్ చేస్తేనే ఎవ్వరికి అయిన క్షణాల్లో మరణం తప్పదు.. ముందు ఆ వీడియో చూద్దాం పదండి. 


 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Royal Pythons (@royal_pythons_)

Also Read: Evaru Meelo Koteeswarulu New Promo: బుల్లితెరపై మహేష్ – ఎన్టీఆర్ సందడి.. ప్రోమో రిలీజ్..

వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు 

వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు.. మరి కొందరు విచిత్రంగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను  Royal_pythons_ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో "ఇదో అద్భుతమైన దృశ్యం" అని క్యాప్షన్‌ పోస్ట్ చేశారు. దాహంతో ఉన్న పాము నీరు తాగటానికి ఇంట్లో ప్రవేశించిందని తెలుస్తుంది. వారం క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 1 లక్షా 22 వేలకు పైగా వ్యూస్ రాగా.. రోజు రోజుకు ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. నెటిజన్లు ఈ వీడియోకి ఫిదా అవుతున్నారు.. 

Also Read: Viral Pre Wedding Photoshoot: గంటలో పెళ్లి.. జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తోన్న పెళ్లి కూతురు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News