Viral News: నోట్లో ఏది పడితే అది పెట్టుకొని పిల్లలు కడుపునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. దీంతో తల్లిదండ్రులకు అది పెద్ద సమస్యల మారుతుంది... ఆసుపత్రిలో చుట్టూ తిరిగి వేల ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది ఇలా ఉంటే నోట్లో కొన్ని వస్తువులు పెట్టుకొని ఏకంగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే 15 ఏళ్ల ఓ బాలిక ఏకంగా అన్నం తిన్నంత ఈజీగా ఏం తిన్నదో తెలిస్తే వామ్మో అని ఆశ్చర్యపోతారు. వైద్యులు సైతం తెలిసి షాక్ గురయ్యారు. అమలాపురం ఉప్పల మండలం భట్టుపాలెం కు చెందిన బాలిక చేసిన పనికి తల్లిదండ్రులు, బంధువులను కూడా బిత్తరపోయేలా చేసింది.
మరి చిన్నపిల్లలు అయితే ఆట వస్తువులు పెట్టుకోవడం వంటివి చూస్తాం. కొందరికి గొంతులో అడ్డుపడి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి.. మరి కొందరు పెద్దలు వెంటనే గమనించి వారి నోట్లో నుంచి తీసేస్తారు. అప్పుడప్పుడు గొంతులో చికెన్ బొక్క ఇతర ఆహార పదార్థాలు ఇరుక్కోవటం వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి... కానీ ఈ అమ్మాయి వయస్సు తెలిసి తెలియని వయసు కాదు. 15 ఏళ్ల అమ్మాయి తన తల వెంట్రుకలు తానే తింటూ ఆశ్చర్యానికి గురిచేసింది.. ప్రతిరోజు ఇలా మూడు నెలలు చేయటం వల్ల తరచుగా వాంతులు అవుతున్నాయి. దీంతో అసలు సంగతి ఏంటో అని డాక్టర్ల వద్దకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు.. అక్కడ టెస్ట్ చేసిన వైద్యులు ఆశ్చర్యపోవడం వారి వంతైంది.
ఇదీ చదవండి: స్వరకర్తకు అశ్రునివాలి.. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అరుదైన చిత్రాలు..
సాధారణంగా ఏదైనా ఇష్టమైన ఆహారం అంటే మళ్లీ మళ్లీ తినడానికి మొగ్గు చూపుతారు పిల్లలు పెద్దలు. ఈ అమ్మాయి ఏకంగా తన జుట్టు వెంట్రుకలు తానే నమిలి నూడుల్స్ మింగినట్టు జుట్టు మింగేస్తుంది. ఇలా చేయడం వల్ల మూడు నెలలుగా ఏది తిన్న వాంతులకు గురవుతుంది. దీంతో భయభ్రాంతులకు గురైన తల్లిదండ్రులు అమ్మాయిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్యులు అసలు అమ్మాయికి ఏమైందా అని ఎండోస్కోపీ చేశారు. తద్వారా వారికి తెలిసిన భయానక నిజం ఏంటంటే ఆ అమ్మాయి తన వెంట్రుకలు తానే నమిలి మింగుతూ ఉందని ఇదంతా కడుపులో బాగా ఒక పెద్ద కణితిలా పేరుకుపోయింది. ఇలా జరగటం వలన అమ్మాయి ఏం తిన్నా కానీ వాంతుల రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇక ఆ వైద్యులు ఆ అమ్మాయికి వెంటనే సర్జరీ చేశారు ఇక ఆ జుట్టు మొత్తం ఏకంగా కేజీన్నారా అయ్యింది. అసలు విషయం తెలిసిన తల్లిదండ్రులు బంధువులు షాక్ కి గురయ్యారు ఇదేం అలవాటమ్మ అని ఆశ్చర్యపోతున్నారు. ఈమె చేసిన పని ఇప్పటి వరకు మీరు కూడా విని ఉండరు. కొంతమంది బియ్యం తినే అలవాటు ఉంటుంది. మరికొంత మందికి స్లేట్ పెన్సిల్ తినే అలవాటు కూడా ఉంటుంది. కానీ, ఇలా జుట్టు తినడం ఈ మహాతల్లికే సాధ్యమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.