Viral Video: ఒక్క క్షణం ఆలస్యమైనా ప్రాణాలు దక్కేవి కాదు.. తృటిలో పెను ప్రమాదం నుంచి బిడ్డను కాపాడిన తండ్రి

Man Saves Baby from Accident: రోడ్డుపై వెళ్లేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కొన్నిసార్లు ఇతరుల నిర్లక్ష్యం మనకు ముప్పు తీసుకురావొచ్చు. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 7, 2022, 04:16 PM IST
  • రెప్పపాటులో బిడ్డను కాపాడుకున్న తండ్రి
  • ఒక్క క్షణం ఆలస్యమైనా ప్రాణాలు గాల్లో కలిసేవి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Viral Video: ఒక్క క్షణం ఆలస్యమైనా ప్రాణాలు దక్కేవి కాదు.. తృటిలో పెను ప్రమాదం నుంచి బిడ్డను కాపాడిన తండ్రి

Man Saves Baby from Accident: రోడ్డుపై వెళ్లేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కొన్నిసార్లు ఇతరుల నిర్లక్ష్యం మనకు ముప్పు తీసుకురావొచ్చు. అలాంటి సందర్భాల్లో తృటిలో బయటపడితే అదృష్టమనుకోవాలి. తాజాగా బ్రెజిల్‌లో జరిగిన ఓ ఘటనలో ఓ చిన్నారిని అతని తండ్రి తృటిలో ప్రమాదం నుంచి కాపాడాడు. ఒక్క క్షణం అటు, ఇటు అయి ఉంటే ఆ చిన్నారి ప్రాణాలు దక్కేవి కాదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్రెజిల్‌లోని సావో ఫెలిక్స్ డో జింగు అనే ప్రాంతంలో గత జూలై 30న ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబం సరదాగా బయటకు వెళ్లిన సమయంలో ఒకచోట రోడ్డు పక్కన కాసేపు ఆగారు. ఆ సమయంలో చిన్నారిని బైక్‌పై కూర్చోబెట్టి ఆడిస్తున్నాడో లేక ఇక అక్కడినుంచి వెళ్లే క్రమంలో చిన్నారిని బైక్‌పై కూర్చోబెట్టడమో చేశాడు అతని తండ్రి. అది జరిగిన క్షణ కాలంలోనే రయ్యిమని ఓ కారు అటువైపు దూసుకొచ్చింది.

అలా కారు దూసుకురావడం గమనించాడో లేదో బైక్‌పై ఉన్న బిడ్డను వెంటనే చేతుల్లోకి తీసుకుని రెండడుగులు వెనక్కి జరిగాడు. చిన్నారి ఆ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడగా.. ఆ కారు అతని బైక్‌ను వేగంగా ఢీకొట్టి వెళ్లింది. ఆపై ఆ చిన్నారి తండ్రి తీవ్ర కోపోద్రిక్తుడై ఆ కారులో వెళ్లినవారిపై గట్టిగా అరిచాడు. అతను కారును గమనించకపోయినా.. ఒక్క క్షణం ఆలస్యం చేసి వున్నా అతని బిడ్డ ప్రాణాలు దక్కేవి కాదేమో. టీఆర్టీ వరల్డ్ అనే ఇన్‌స్టా ఖాతా ద్వారా అప్‌లోడ్ అయిన ఈ వీడియోకి ఇప్పటివరకూ 2.50 లక్షల వ్యూస్ వచ్చాయి. రాష్ డ్రైవింగ్‌తో చిన్నారి కూర్చొన్న బైక్‌ను ఢీకొట్టినవారిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TRT World (@trtworld)

Also READ: Samsung Cystal Smart TV: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీపై రూ.20 వేలు తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాకపోవచ్చు

Also Read: Also Read: Samsung Smart TV: బెస్ట్ బ్రాండ్, బెస్ట్ ఫీచర్స్.. 32 అంగుళాల శాంసంగ్ స్మార్ట్ టీవీ సగం కన్నా తక్కువ ధరకే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News