Scary Video: చెమటలు పట్టిస్తున్న వీడియో..వ్యక్తిపైకి కింగ్ కోబ్రా ఎలా ఎగబడుతుందో చూడండి!

భయంకరమైన కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిపై  కోపంతో ఎలా విరుచుకపడిందో చూడండి.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా ఒకసారి చూడండి 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2021, 08:08 AM IST
  • ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము కింగ్ కోబ్రా
  • కింగ్ కోబ్రా కాటు వేస్తే క్షణాల్లో ప్రాణాలు కోల్పోవటం పక్కా
  • స్నేక్ స్నాచర్ పై కింగ్ కోబ్రా ఎలా ఎగబడుతుందో చూడండి
  • చేతిలోంచి తప్పించుకోడానికి ఎంతలా ప్రయత్నించిందో చూడండి
Scary Video: చెమటలు పట్టిస్తున్న వీడియో..వ్యక్తిపైకి కింగ్ కోబ్రా ఎలా ఎగబడుతుందో చూడండి!

Man Trying to Catch a Big Kng Cobra See How it is attacking on Men: పాము అంటేనే భయంతో వణికిపోతుంటాము.. ! కదా..   మరీ అలాంటిది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా ఎదురుపడితే.. పై ప్రాణాలు పైనుండే పోతాయి.. 

కానీ స్నేక్ స్నాచర్లు తెలివిగా వాటి దృష్టిని మరల్చి వాటిని పట్టుకుంటూ  ఉంటారు. అయితే..  మిగిలిన పాముల సంగతి ఏంటో తెలీదు కానీ కింగ్ కోబ్రాను పట్టడం అంటే ప్రాణాలతో చెలగాటమే..!! మనిషి ఎత్తు లేస్తూ.. బుసలు కొడుతూ పాము పట్టే వ్యక్తి పై ఎలా ఎగబడుతుందో చూడండి.. 

Also Read: Magical Rs.1 Note: గంటలో లక్షాధికారిని చేసే 1 రూపాయి నోటు.. దీని ఖరీదు రూ.7 లక్షలు

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్  అవ్వగా.. వీడియో చూసిన నెటిజన్లు కింగ్ కోబ్రాను పట్టుకోవటం అంటే ప్రాణాలు పణంగా పెట్టినట్టే అని అంటున్నారు.. నెటిజన్లను భయానికి గురి చేసిన వీడియో మీరు కూడా ఒక లుక్కేయండి!

వీడియో చూస్తే తెలుస్తుంది.. స్నేక్ స్నాచర్ పెద్దగా ఉన్న కింగ్ కోబ్రాను పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.. అకస్మాత్తుగా కోపానికి గురైన పాము .. అతడిపై దాడి చేయటానికి ఎలా బుసలు కొడుతూ పైకి ఎగబడిందో చూసారా..??

కోబ్రాను పట్టుకునే క్రమంలో అతడికి కొంత మంది సహాయం చేయటం మనం చూడవచ్చు. పట్టుకునే క్రమంలో అతడిని కాటు వేయటానికి ఎలా ప్రయత్నించిందో కూడా చూడవచ్చు.. పట్టుకున్నాక కూడా చేతిలోంచి విడిపించుకోటానికి ఎలా ప్రయత్నించిందో కూడా చూడండి!

Also Read: Shreya Muralidhar : కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ మృతి

nAnimal_World అనే ట్విట్టర్ అకౌంట్లో  పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది..  సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. కింగ్ కోబ్రా ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x