King Cobra Hatch Video Now: గుడ్డులో నుంచి బయటికి వచ్చిన అప్పుడే జన్మించిన కింగ్‌ కోబ్రా.. ఈ క్యూట్‌ వీడియో మీ కోసమే..

King Cobra Hatch From Eggs Viral Full Video Watch Here: అందరూ వివిధ రకాల జంతువులకు సంబంధించిన పిల్లలను చూసి ఉంటారు. కానీ ఎప్పుడైన అప్పుడే జన్మించి.. నాగు పాము పిల్లలను ఎప్పుడైనా చూశారా? చూడని వారు ఇప్పుడు చూడండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 4, 2025, 06:10 AM IST
King Cobra Hatch Video Now: గుడ్డులో నుంచి బయటికి వచ్చిన అప్పుడే జన్మించిన కింగ్‌ కోబ్రా.. ఈ క్యూట్‌ వీడియో మీ కోసమే..

King Cobra Hatch From Eggs Viral Full Video Watch: మనం తరచుగా రోడ్లపైన కుక్కపిల్లలు, పిల్లి పిల్లలు చూస్తూ ఉంటాం.. ఇక ఊళ్లో జీవించేవారైతే.. దూడలు, ఇతర జంతువుల పిల్లలను చూస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా అప్పుడే పుడుతున్న విషపూరితమైన కింగ్‌ కోబ్రా పిల్లలను చూశారా? ప్రకృతిలో ఎంతో భయకరమైన సరీసృపాల్లో ఒకటైన ఈ పాము అప్పుడే జన్మిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. మనం తరచుగా సోషల్ మీడియాలో పెద్ద పెద్ద పాములకు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటారు. కానీ ఈ వీడియో చూస్తే అందరికీ ఆశ్చర్యమేస్తుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తి చిన్న పాము గుడ్డును పట్టుకుని వీడియో కోసం మొబైల్‌కి చూపించడం మీరు గమనించవచ్చు. అయితే ఈ వీడియో కనిపిస్తున్న పాము గుడ్డు సగం విరిగి ఉంటుంది. అందులో నుంచి చిన్న విషపూరితమైన కింగ్‌ కోబ్రా పాము పిల్ల బయటి రావడం మీరు గమనించవచ్చు. అప్పుడే జన్మించిన పాము ఇలా గుడ్డులో నుంచి బయటి రావడం చూసిన నెటిజన్స్‌ తెగ ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఆ పాము నోటిలో నుంచి చిన్న నాలుకను బయట పెట్టి, గుడ్డులో నుంచి బయటి లేవడం మీరు గమనించవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 

ఈ వీడియో గత సంవత్సరం కిందే ఇన్‌స్టాగ్రామ్‌ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ట్విట్టర్‌ X లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను "నేచర్ ఈజ్ అమేజింగ్" అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోను @AMAZlNGNATURE అనే ఖాతా నుంచి షేర్‌ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 19.7 మిలియన్స్‌కు పైగా నెటిజన్స్‌ వీక్షించారు. అయితే ఈ సన్నివేశాలు చూసిన నెటిజన్స్‌ వారి అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :: King Cobra Shed Video: 5 అడుగుల కింగ్‌ కోబ్రా కుబుసాన్ని తొలిచేసిన యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

చాలా మంది ఇలా కామెంట్లు చేస్తున్నారు.."ఈ చిన్న కింగ్‌ కోబ్రా పిల్ల ఎంతో చురుకుగా ఉంది.. చూడడానికి చాలా క్యూట్‌గా ఉంది." అని కొంతమంది కామెంట్స్‌ చేస్తే.. మరికొంతమంది " ఈ పాము చూడడానికి ఎంతో క్యూట్‌గా ఉన్నప్పటికీ చాలా డేంజర్‌ అని" అంటున్నారు. సాధరనంగా ఈ పాములు పద్దెనిమిది అడుగుల పొడవు వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇవి ఒక్కసారి కాటేస్తే 10 నిమిషాల్లో తప్పకుండా చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మనిషి మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి :: King Cobra Shed Video: 5 అడుగుల కింగ్‌ కోబ్రా కుబుసాన్ని తొలిచేసిన యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

Trending News