Devotees drink ac water in banke Bihari temple: కొంత మంది అతిగా నమ్మకాలను పాటిస్తుంటారు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు కొన్ని విచిత్రమైన పనులు చేస్తుంటారు. సాధారణంగా దేవుడి గుడిలో వెళ్లినప్పుడు ఎవరైన దండం పెట్టుకుంటారు. కానీ కొంత మంది మాత్రం అతిగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వాళ్ల నమ్మకాలను కొంత మంది కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటారు. వీరి నమ్మకాలను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారు.
Serious education is needed 100%
People are drinking AC water, thinking it is 'Charanamrit' from the feet of God !! pic.twitter.com/bYJTwbvnNK
— ZORO (@BroominsKaBaap) November 3, 2024
ఏదో పాత వస్తువులు లేదా రాళ్లను చూపించి అది దేవతలు ఉపయోగించిన రాయి అని చెప్తుంటారు. మరికొందరు కొన్ని వస్తువులు లేదా ఏదో ఒక రాళ్లను చూపిస్తు ఇది శక్తివంతమైందని, దీన్ని పురాతన కాలం నుంచి ఉపయోగించారని కూడా చెప్తుంటారు.
మొత్తానికి ఏదో విధంగా ఎదుటి వాళ్లను బురిడి కొట్టించే పనులు చేస్తారు. అయితే.. ఇటీవల దొంగబాబాల చేతిలో మోసపోతుంది ఎక్కువగా చదువుకున్న వాళ్లే ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో మథురలోని బాంకే బిహారీ ఆలయంలో వెరైటీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
ఉత్తర ప్రదేశ్ లోని మథురలోని బాంకే బిహారీ ఆలయంలో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. స్థానికంగా ఉన్న వ్రిందావన్ లో.. ఏనుగు శిల్పం నుంచి నీళ్లు కారుతుండటంను కొంత మంది భక్తులు గమనించారు. దీంతో అక్కడి భక్తులు.. ఏనుగు శిల్పం నుంచి వస్తున్న నీళ్లను ప్లాస్టిక్ గ్లాస్ లలో తీసుకుని మరీ తాగుతున్నారు.
మరికొందరు అక్కడి నీళ్లను తలమీద కూడా చల్లుకుంటున్నారు. అక్కడున్న వారు.. అది దేవుడి పాదాలు లేదా అభిషేకం నీళ్లు కాదని ఏసీ నుంచి లీక్ అవుతున్న నీళ్లు అంటూ చెప్పారు. కానీ అక్కడ మాత్రం ఒకర్ని చూసి మరికొందరు ఇలా నీళ్లను తలమీద చల్లుకుంటూ, తాగుతున్నారు.
Read more: Viral Video: బాబోయ్.. నీకు పెద్ద దండం తల్లో.. నాగుపాములకు తలంటు పోస్తున్న మహిళ.. వీడియో వైరల్..
మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ కు గురౌతున్నారు. మరికొందరు మాత్రం ఇదేంటి అతిభక్తి అంటూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం.. ఇలా ఉంటేనే మోసపోతారని కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.