Twin Sisters Marry With One Boy: మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఓ అపూర్వ వివాహానికి జరిగింది. ఇద్దరు కవల సోదరీమణులు ఒకే యువకుడిని పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి సంబంధించి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మల్షిరాస్ తాలూకాలో శుక్రవారం ఘనంగా పెళ్లి జరిగింది. అక్కాచెల్లెలు ఒకే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు..? మరో వరుడు దొరకలేదని కాదు.. మరి ఎందుకని అనుకుంటున్నారా..? పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మల్షిరాస్ ప్రాంతానికి చెందిన పింకీ, రింకీ ఇద్దరు యువతులు కవలలు. ఇద్దరూ ఐటీ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అక్కాచెల్లెళ్లిద్దరూ కలిసి పెరిగారు. భవిష్యత్తులో కూడా ఇద్దరూ కలిసే జీవించాలని భావించారు. అప్పుడే వారి జీవితంలోకి అతుల్ మల్షీరాస్ అనే వ్యక్తి ప్రవేశించాడు. అతుల్ మల్షిరాస్ ముంబైలో ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం చేస్తున్నాడు.
పింకీ, రింకీ తండ్రి కొద్దిరోజుల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి వారు తల్లితో కలిసి ఉంటున్నారు. తమ తల్లి అనారోగ్యం పాలైనప్పుడు అక్కాచెల్లెలు ఇద్దరూ అతుల్ కారులోనే తమ తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అతను వాళ్లకు ఎంతో సాయం చేశాడు. ఈ క్రమంలోనే ముగ్గురు మధ్య పరిచయం బాగా పెరిగింది. దీంతో తుల్‌ను వివాహం చేసుకోవాలని పింకీ, రింకీ నిర్ణయించుకున్నారు.
ఈ విషయాన్ని రెండు కుటుంబాల పెద్దలకు చెప్పి ఒప్పించారు. అక్లూజ్ గ్రామంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వన్ ప్లస్ వన్ ఆఫర్, బంపర్ ఆఫర్ కొట్టేశాడంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అయితే వీరి పెళ్లి విషయంలో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలిసింది. ఈ వివాహంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
महाराष्ट्र के पंढरपुर में दो सगी बहनों ने एक ही लड़के से शादी की..#Viral #viralvideo pic.twitter.com/eZQFjLlvO5
— Vivek Gupta (@imvivekgupta) December 3, 2022
Also Read: Gujarat Election 2022: నేడే గుజరాత్‌లో రెండో దశ పోలింగ్.. ప్రధాని మోదీ, అమిత్ షా ఓటు వేసేది ఇక్కడే..
Also Read: KL Rahul: హీరోనే విలన్ అయ్యాడు.. కేఎల్ రాహుల్ చేసిన ఒకే ఒక తప్పు.. ఆ క్యాచ్ పట్టుంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి