Gold In Sanitary Napkins: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు. కస్టమ్ అధికారుల కళ్లు కప్పేందుకు కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా శానిటరీ న్యాప్‌కిన్‌లో దాచిన రూ.37.58 లక్షల విలువైన 612 గ్రాముల 24 క్యారెట్ బంగారాన్ని తిరుచ్చి విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్‌ను చాకచక్యంగా బయటపెట్టారు. బంగారాన్ని పేస్ట్ రూపంలోకి మార్చి.. తెలివిగా మహిళల న్యాప్‌కిన్స్‌లో దాచారు. విమానాశ్రయంలో సాధారణ భద్రతా తనిఖీల్లో ఈ విస్తృతమైన స్మగ్లింగ్ ఆపరేషన్‌ను కస్టమ్స్ అధికారులు బట్ట బయలు చేశారు. రెండు బంగారు పేస్ట్ ప్యాకెట్లను అధికారులు జప్తు చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోను నెట్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. కస్టమ్స్ అధికారులు శానిటరీ న్యాప్‌కిన్‌లను నిశితంగా విడదీసి.. జాగ్రత్తగా దాచిపెట్టిన బంగారు పేస్ట్‌ను బయటపెడుతున్న సమయంలో వీడియోను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి న్యాప్‌కిన్‌లో పెట్టాలనే ఐడియా ఎలా వచ్చిందయ్యా..? అని అడుగుతున్నారు. అయితే బంగారం పేస్ట్ రూపంలో ఉంటే అధికారులు ఎలా ట్రాక్ చేశారు..? ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు. తిరుచి విమానాశ్రయం ఎప్పుడూ ఆశ్చర్యం కలిగించదని.. ఇలాంటి సంఘటనలు అక్కడ నిత్యం జరుగుతాయని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
#WATCH | Tamil Nadu: On Oct 20, the officers of Trichy Airport customs recovered 612 gm gold of 24K purity valued at Rs 37.58 lakh extracted from two gold paste packets that were concealed in sanitary napkins at Trichy airport: Customs
(Source: Customs) pic.twitter.com/KIiH5R4FWH
— ANI (@ANI) October 21, 2023
అయితే బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తి పట్టుబడినా.. స్మగ్లింగ్ వెనుక ఉన్న వ్యక్తి వివరాలు వెల్లడికాలేదు. ఇలా విమానాశ్రయంలోకి ప్రవేశించే వారికి సంబంధించిన కీలకమైన సమాచారం బహిర్గతం కాలేదు. ఇంతకు ముందు ఆగస్టులో జరిగిన ఒక సంఘటనలో కౌలాలంపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 149 గ్రాముల బంగారం, రూ.8.9 లక్షలు, రెండు నుటెల్లా జార్లలో రహస్యంగా దాచగా.. అధికారులు పట్టుకున్నారు. ఇలా సరికొత్త ప్లాన్లతో గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు.
Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.