/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

Kurnool Tomato Farmer Family Become Millionaire in 20 Days: రోజు రోజు నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. కానీ గత కొద్ది కాలంగా.. వంట నూనె ధరలు.. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు కొంచెం తగ్గిన సంగతి అందరికి విధితమే! గ్యాస్ ధర మాత్రం తగ్గటం లేదు.. ఇపుడు టమోటా ధర కూడా ఆకాశాన్నంటుతుంది. 

ముఖ్యంగా టమోటా ధరలు చూస్తుంటే.. కొనుగోలు దారులకు చుక్కలు కనపడుతున్నాయి.. 20 రోజుల నుండి వీటి రేట్లు రూ. 50 నుండి పెరుగుతూ.. కిలో రూ. 150కి చేరువైంది.. పెట్రో-డీజిల్ ధరల కన్నా కిలో టమోటా ధర మించిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాకి వెళ్లిన ఇదే పరిష్టితి.. మధ్యతరగతి కుటుంబాలు టమోటా కొనటమే గగనంలా మారిపోయింది. 

Also Read: Bank Holidays: డిసెంబర్‌లో ఏకంగా 16 రోజులు బ్యాంకులకు సెలవులు.. అవేంటో మీరే చూడండి!

చెన్నైకి వెళ్తే అక్కడ కిలో టమోటా ధర రూ. 140 కి చేరుకోగా.. నవంబర్ మొదటి వారంలో రూ. 20 ఉన్న టమోటా 20 రోజుల్లోనే సెంచరీ దాటేసింది. వీటికి తోడుగా భారీ వర్షాలు, తుఫానుల కారణంగా చాలా ప్రాంతాల్లో జరిగిన పంట నష్టం కారణంగా దిగుబడి తగ్గటం వలన టమోటా ధర ఆకాశాన్నంటుతుంది. భారీ వర్షాల కారణంగా సరఫరా నిలచిపోవటం కూడా ధర పెరుగుదలకు కారణం. 

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా టమోటా ధరలు భగ్గుమంటున్నాయి.. ఉల్లికన్న టమోటా రేట్లే అధికంగా ఉన్నాయి. ఇక ఆంధ్రలో ప్రతి ఏడాదికి లక్ష 40 వేల ఎకరాలకు పైగా.. దాదాపు 2.27 లక్షల టన్నుల టమాటా పంట సాగవుతుంది. అందులోను ఎక్కువ భాగం అనంతపురం, చిత్తూరు జిల్లా ప్రాంతాలలో టమోటా పంట పండించే వారి సంఖ్య అధికం.   

అయితే ఈ ప్రాంతాలలో గత 10 రోజుల నుండి భారీ వర్షాలు కారణంగా పంట దెబ్బ తినటం.. రోడ్లు నాశనం అవ్వటంతో రవాణాపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. అందరి సంగతి ఏమో కానీ.. టమోటా పండించిన కొన్ని రైతు కుటుంబాలు తక్కువ సమయంలోనే లక్షల్లో సంపాదిస్తున్నారు.

Also Read: Siddha's Saga Teaser: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ‘ఆచార్య’ నుంచి మరో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక కోడుమూరు మండలం ప్యాలకుర్తి అనే గ్రామంలో మహమ్మద్ రఫీ, సైబా, ఉషాలాం వారిది ఉమ్మడి కుటుంబం. వారికి ఉన్న 100 ఎకరాల పొలంలో 40 ఎకరాల మేర టమోటా పంట వేశారు. ఇపుడు అదే వారికి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. దేశ వ్యాప్తంగా టమోటా ధరలు రూ. 100 పైనే చేరటంతో ఇప్పటి వరకు రూ. 80 లక్షలకు పైగా వారికి ఆదాయం చేకూరింది. అంతేకాకుండా.. రానున్న రోజుల్లో మరింత లాభం వచ్చే అవకాశాలున్నాయని వాపోతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
tomato price increased Kurnool tomato farmer family become millionaires in 20 days
News Source: 
Home Title: 

Tomato Price: 20రోజుల్లో లక్షాధికారిని చేసిన టమోటా.. ఇప్పటి వరకు రూ.80 లక్షలపైనే..

Tomato Price Increased: 20 రోజుల్లో లక్షాధికారిని చేసిన టమోటా.. ఇప్పటి వరకు రూ. 80 లక్షలపైనే...
Caption: 
Tomato Price Increased: 20 రోజుల్లో లక్షాధికారిని చేసిన టమోటా.. ఇప్పటి వరకు రూ. 80 లక్షలపైనే... (File Photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఆకాశాన్నంటుతున్న టమోటా ధరలు 

లక్షాధికారులవుతున్న టమోటా రైతులు 

20 రోజుల్లో రూ. 80 లక్షల ఆదాయం పొందిన రైతు 

Mobile Title: 
Tomato Price: 20రోజుల్లో లక్షాధికారిని చేసిన టమోటా.. ఇప్పటి వరకు రూ.80 లక్షలపైనే..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, November 24, 2021 - 18:40
Request Count: 
105
Is Breaking News: 
No