Thief Viral Video: ఇదేం పాడుబుద్దిరా అయ్యా.. అవి దొంగతనం చేసి ఏం చేసుకుంటావ్! విషయం తెలిస్తే నవ్వులే

Viral Video, Funny Thief Steals Womens Undergarments. సాధారణంగా దొంగలు బంగారం, డబ్బులు, చీరలు లాంటివి దొంగతనాలు చేస్తారు. కానీ ఓ దొంగ మాత్రం మహిళల లోదుస్తులను చోరీలు చేస్తున్నాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 6, 2022, 03:03 PM IST
  • ఇదేం పాడుబుద్దిరా అయ్యా
  • అవి దొంగతనం చేసి ఏం చేసుకుంటావ్
  • విషయం తెలిస్తే నవ్వులే
Thief Viral Video: ఇదేం పాడుబుద్దిరా అయ్యా.. అవి దొంగతనం చేసి ఏం చేసుకుంటావ్! విషయం తెలిస్తే నవ్వులే

Funny Thief Steals Womens Undergarments in Gwalior at midnight: దొంగలలో వెరైటీ దొంగలు కూడా ఉంటారు. చిత్ర విచిత్రమైన వాటిని దొంగతనాలు చేస్తుంటారు. సాధారణంగా దొంగలు బంగారం, డబ్బులు, చీరలు లాంటివి దొంగతనాలు చేస్తారు. కానీ కొంత మంది దొంగలు మాత్రం మహిళల లోదుస్తులు, ఇన్నర్‌లను కూడా చోరీలు చేస్తుంటారు. ఇలాంటి వింత సంఘటనలను మనం చాలా అరుదుగా వింటుంటాం లేదా చూసేవుంటాం. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బాలుడు మహిళల లోదుస్తులను దొంగతనం చేస్తున్నాడు. 

ఆకాష్ వర్మ అనే యువకుడు గ్వాలియర్‌లో మహిళల లోదుస్తులు, ఇన్నర్‌లను దొంగతనం చేస్తున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆకాష్ పైకప్పు లేదా గేట్ ద్వారా ఇళ్లలోకి ప్రవేశించి ఉతికేసిన మహిళల లోదుస్తులను దొంగతనం చేస్తున్నాడు. గ్వాలియర్‌ ప్రాంతంలో చాలా ఇళ్లలో దొంగతనాలు చేశాడు. మహిళలు అందరూ తమ ఇన్నర్‌లు కనిపించకుండా పోవడంతో.. ఏం జరుగుతుందో తెలియక అయమయానికి గురయ్యారు. ఇన్నర్‌లు పోయాయని ఫిర్యాదు ఇస్తే బాగుండదని ఎవరూ ముందుకు రాలేదు. 

ఆకాష్ వర్మ ఎప్పటిలానే అర్ధరాత్రి దాటిన తర్వాత తలుపులు తెరిచి ఉన్న ఓ ఇంటిలోకి వెళతాడు. చాలా సమయం తర్వాత ఆకాష్ తన చేతిలో మహిళల లోదుస్తులతో బయటికి వచ్చాడు. ఈ తతంగం అంతా.. పక్కింటిలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దాంతో అర్ధరాత్రి ఓ దొంగ తన ఇంట్లోకి ప్రవేశించి తన భార్య లోదుస్తులను దొంగిలించాడని ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు ఆకాష్ వర్మ అని గుర్తించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

ఆకాష్ వర్మకు సంబందించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయింది. ఈ వీడియోను 'NaiDunia' అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'గ్వాలియర్‌లో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ దొంగ ఇంట్లోకి ప్రవేశించి.. నగలు కాదు, లోదుస్తులు దోచుకుంటాడు. ఈ ఘటన సీసీటీవీలో చిక్కింది' అని ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన అందరూ తెగ నవ్వుకుంటున్నారు. 'ఇదేం పాడుబుద్దిరా అయ్యా', 'అవి దొంగతనం చేసి ఏం చేసుకుంటావ్' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: ఒట్టి చేతులతోనే.. కింగ్ కోబ్రా, త్రాచు పాముకి ఎలా స్నానం చేయించాడో చూడండి! నువ్ సూపర్ బాస్

Also Read: Suresh Raina Retires: ఆటకు వీడ్కోలు పలికిన సురేశ్ రైనా.. ఇక చెన్నై టీమ్‌కి కెప్టెన్ పక్కా?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News