మొబైల్ బ్యాటరీని భద్రంగా చూసుకునే 'Accu Battery' యాప్

మీ మొబైల్ బ్యాటరీని సమర్ధవంతంగా వాడుకునే చిట్కాలు తెలుసుకోండి.. 

Last Updated : Jan 15, 2018, 09:59 AM IST
మొబైల్ బ్యాటరీని భద్రంగా చూసుకునే  'Accu Battery'  యాప్

స్మార్ట్  ఫోన్ వినియోగదారులకు ఎదురయ్యే అతిపెద్ద సమస్య బ్యాటరీ. ఫోన్ వినియోగించే సమయంలో సడన్గా బ్యాటరీ అయిపోతే ఏం చేయాలి. అప్పుడు మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పవర్ బ్యాంక్. అందుకే ఫోన్‌తో పాటు పవర్ బ్యాంక్ కొనడం సర్వసాధారణం అయిపోయింది. అయితే దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా అంటే..కచ్చితంగా ఉందనే చెప్పాలి. అదే బ్యాటరీని జాగ్రత్తగా చూసుకొనే  'Accu Battery' యాప్. బ్యాటరీని కాపాడడం ..బ్యాటరీ రక్షణకు సంబంధించి వినియోగదారునికి ఎప్పటికప్పుడు తగు సూచనలు చేయడం దీని ప్రత్యేకత. ఇది ఒక విశిష్టమైన పవర్ మేనేజ్ మెంట్ యాప్. ఆ యాప్ మనకు తోడుంటే పవర్ బ్యాంక్ అవసరం కూడా రాదు..ఇంత ప్రత్యేకత ఉన్న ఈ యాప్ గురించి కాస్త వివరంగా తెలుసుకుందామా మరి..

వాస్తవానికి బ్యాటరీ లైఫ్ పై అనేక ప్రభావాలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్లు మనం ఫోన్‌ను వాడేస్తుంటాం. ఛార్జింగ్ పెట్టేస్తూ ఉంటాం. తీరా బ్యాటరీ అయిపోయిన తర్వాత బాధపడుతుంటాం. అయితే ఈ సమస్య నుండి బయటపడే ఒకే ఒక్క మార్గం ఉంది. అదే 'Accu Battery' యాప్. ఈ యాప్  ద్వారా సమర్థవంతంగా బ్యాటరీని ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ బ్యాటరీ వినియోగాన్ని మీకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. సహజంగా మన ఫోన్లలో ఉండే డిఫాల్ట్ బ్యాటరీ టూల్స్  ఎప్పటికప్పుడు బ్యాటరీ గురించి అప్రమత్తం చేస్తూ ఉంటాయి.అయితే.. ఇంకెందుకు ఈ యాప్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే  వాటికి..ఈ యాప్‌‌కు చాలా తేడా ఉంది. 

'ఆక్యూ బ్యాటరీ' ప్రత్యేకత..

మన ఫోన్లలో ఉండే డిఫాల్ట్ బ్యాటరీ టూల్స్ ద్వారా బ్యాటరీ యూజ్ అయ్యిందో లేదో  మనం స్క్రీన్  ఆన్ అయినపుడు చూస్తుంటాం లేదా స్క్రీన్ ఆఫ్ అయినప్పుడు చూస్తాం. కొన్ని సందర్భాల్లో ఫోన్ డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు కూడా ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. డీప్ స్లీపింగ్ అనేది ఒక పవర్ సేవింగ్ మోడ్. ఫోన్ యొక్క స్క్రీన్ ఆఫ్ అయినప్పుడల్లా ఇది ఆక్టివ్ అవుతూ ఉంటుంది. ఫోన్ యోక్క స్క్రీన్ ఆఫ్ అయినప్పడు కూడా ఫోన్ యొక్క సాఫ్ట్ వేర్ పనిచేస్తూనే ఉంటుంది. మనకు ఇంత వరకే తెలుసు.  అయితే చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే బ్యాటరీ అయిపోతూ ఉంటుంది..  ఈ యాప్ వలన వివిధ స్థితులతో బ్యాటరీ వినియోగం ఎలా ఉంటుంది అనే విషయం చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఫోన్ మరీ ఎక్కువగా ఛార్జింగ్ పెట్టడం వలన బ్యాటరీ అరిగిపోయే ప్రమాదం ఉంది. ఇందులో ఉండే హిస్టరీ సెక్షన్‌లో మనం ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టింది..ప్రతీసారి ఎంత సేపు ఛార్జింగ్ పెట్టింది తదితర విషయాలు  తెలుసుకోవచ్చు. 

మరిన్ని ప్రత్యేకతలు...

* బ్యాటరీ యొక్క అరుగుదల చూపిస్తుంది
* ఒరిజినల్ కెపాసిటీతో పాటు ఎస్టిమేటెడ్ కెపాసిటీ ఎంత అనేది కూడా తెలుస్తుంది
*  బ్యాటరీ లైఫ్ సైకిల్ ఏమిటనేది తెలియజేస్తుంది...
* బ్యాటరీ రోజు రోజుకు ఎలా మారుతుందో వినియోగదారుడికి తెలుస్తుంది
* దీని వలన బ్యాటరీ ఛార్జింగ్ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది... ఉపయోగంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది తెలుసుకునే వీలుంది
* ఈ యాప్‌లో  ఇన్ బిల్ట్ అలారమ్ ఉంటుంది. ఇది తగినంత ఛార్జింగ్ అయినప్పుడు మనలను అప్రమత్తం చేస్తుంది
* బ్యాటరీ 80 శాతం ఛార్జింగ్ అయినప్పుడు ఇది డిఫాల్డ్ గా స్పందించి నోటిఫికేషన్లు పంపుతుంది.. ఎందుకంటే 80 శాతం కంటే ఎక్కువ ఛార్జింగ్ అనేది బ్యాటరీ మన్నికకు ప్రమాదకరం..నోటిఫికేషన్‌‌లు మీకు 60 శాతానికే కావాలి అనుకోండి.. దానికి తగ్గట్టు మీరు మార్చుకోవచ్చు
* ఫోన్ మరీ ఎక్కువగా ఛార్జింగ్ పెట్టడం వలన బ్యాటరీ అరిగిపోయే ప్రమాదం ఉంది..ఇందులో ఉండే హిస్టరీ సెక్షన్‌లో మనం ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టింది..ప్రతీసారి ఎంత సేపు ఛార్జింగ్ పెట్టింది తదితర విషయాలు తెలసుకోవచ్చు.
* ఒకవేళ ఛార్జింగ్ పెట్టే సమయానికి  మీ ఛార్జర్  కనిపించలేదు అనుకుందాం..  అలాంటప్పుడు మీ స్నేహితుని ఛార్జర్‌తో మీ ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నారనుకోండి. దానికి సంబంధించిన వేరే బ్యాటరీ సైజు ఉంటుంది కదా.. మరి అప్పుడు మీ బ్యాటరీ ఎలా స్పందిస్తుంది మొదలైన వివరాలు  యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. 
* వేరే ఛార్జర్‌తో ఫోను ఛార్జ్ చేసే సమయంలో ఛార్జింగ్ సగటు స్పీడ్, టెంపరేచర్, కరెంట్ బ్యాటరీ ఫుల్ అవడానికి మిగిలిన సమయం మొదలైన వివరాలన్నీ ఈ యాప్‌లో ఉండే ఛార్జ్ సెక్షన్‌లో కనిపిస్తాయి
* హైవోల్టేజ్ ఛార్జర్‌లను ఉఫయోగించడం వలన బ్యాటరీ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ యాప్‌లో ఉండే ఈ ఫీచర్ వలన మనం వాడుతున్న ఛార్జర్ మన బ్యాటరీకి మంచిదా ..కాదా అన్న విషయం కూడా తెలుసుకోవచ్చు

ఇన్ని ఫీచర్లున్న ఈ యాప్ ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు... ఇంకెందుకు ఆలస్యం..  గూగుల్ ప్లే స్టోర్ వెళ్లి Accu Battery యాప్ డౌన్ లోడ్ చేసుకోండి..

Trending News