Viral Video: ఏడిపించిన యువకుడికి తొక్క తీసి తాట వలిచిన సిస్టర్స్

Viral Video Of Teen Sisters Thrash Molester: 17 ఏళ్ల అమ్మాయిని రోజూ ఏడిపిస్తున్న ఓ యువకుడు.. ఎప్పటిలాగే శుక్రవారం కూడా ఆ అమ్మాయిదారికి అడ్డుపడ్డాడు. చెల్లిని ఒక యువకుడు అడ్డం పడి ఏడిపిస్తున్నాడని చూసిన ఆమె అక్క వెంటనే చెల్లి వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి ఆ యువకుడిని పడేసి తన్ని పట్టపగలే చుక్కలు చూపించారు. 

Written by - Pavan | Last Updated : Jun 26, 2023, 07:22 PM IST
Viral Video: ఏడిపించిన యువకుడికి తొక్క తీసి తాట వలిచిన సిస్టర్స్

Viral Video Of Teen Sisters Thrash Molester: ఆడపిల్లలే కదా అని అలుసుగా తీసుకున్న ఓ యువకుడికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు పట్టపగలే చుక్కలు చూపించారు. ఆడపిల్లలు తలుచుకుంటే ఎవరికైనా జింతాత్త జింతా జింతా జిత్తాత్తత్తా ... అని నిరూపించారు. ఒడిషాలోని బెహ్రంపూర్‌కి చెందిన ఇద్దరు అమ్మాయిలు అహ్మెదాబాద్‌లో కాళీ అవతారమెత్తారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లలో ఒకరి వయస్సు 17 సంవత్సరాలు కాగా మరొకరి వయస్సు 19 ఏళ్లు. ఇద్దరూ కలిసి శుక్రవారం ఉదయం స్కూల్‌కి, కాలేజీకి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

17 ఏళ్ల అమ్మాయిని రోజూ ఏడిపిస్తున్న ఓ యువకుడు.. ఎప్పటిలాగే శుక్రవారం కూడా ఆ అమ్మాయిదారికి అడ్డుపడ్డాడు. చెల్లిని ఒక యువకుడు అడ్డం పడి ఏడిపిస్తున్నాడని చూసిన ఆమె అక్క వెంటనే చెల్లి వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి ఆ యువకుడిని పడేసి తన్ని పట్టపగలే చుక్కలు చూపించారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆ యువకుడికి దేహశుద్ధి చేయడం చూసిన తోటి విద్యార్థులు కూడా వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చి వారికి సహాయంగా నిలిచారు. అతడికి మరోసారి తమ వంతు కోటింగ్ ఇచ్చుకున్నారు.  

బాధితురాలి తల్లి వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 6.45 గంటలకు తన చిన్న కూతురు సైకిల్‌పై స్కూల్‌కి వెళ్తుండగా దారిలో అడ్డం వచ్చిన ఒక యువకుడు ఆమెను అడ్డగించి ఏదో బహుమతి ఇవ్వబోయాడు. ఆ కానుక తీసుకునేందుకు ఆమె నిరాకరించడంతో బలవంతంగా ఆమె చేయి పట్టుకుని ఆ కానుకను బ్యాగులో పెట్టిన యువకుడు.. ఆమెకి ముద్దుపెట్టి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ రోజు ఇంటికి తిరిగొచ్చిన తన చిన్న కూతురు రోజంతా ఏడుస్తూ కూర్చుంది అని బాధితురాలి తల్లి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Benefits of drumsticks: మునగకాయతో నమ్మలేని ప్రయోజనాలు.. తెలిస్తే షాక్ అవుతారు..!

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 20 వరకు ఒక్క అహ్మెదాబాద్‌లోనే 1695 మంది అమ్మాయిలు వేధింపుల బారినపడినట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన వేధింపుల ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... అతడిపై పోక్సో యాక్ట్ కింద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి : Best Veg Foods: ఈ కూరగాయల్ని రాత్రి పూట మార్చి మార్చి తింటే, అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ అన్నీ మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News