Teen stalker: ఆన్‌లైన్‌ డెలివరీ బుకింగ్స్‌ చేస్తూ ట్యూషన్‌ టీచర్‌కు వేధింపులు.. అసలు విషయం తెలిసి ఖంగుతిన్న పోలీసులు..

Teen Harrasses Tuition Teacher:  సినిమా స్టైల్‌లో ఓ ట్యూషన్‌ టీచర్‌ను వేధించాడో ఓ టీనేజర్‌ అసలు విషయం తెలుసుకున్న పోలీసులు సదరు బాధితురాలు ఖంగుతిన్నారు ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Jul 25, 2024, 10:11 AM IST
 Teen stalker: ఆన్‌లైన్‌ డెలివరీ బుకింగ్స్‌ చేస్తూ ట్యూషన్‌ టీచర్‌కు వేధింపులు.. అసలు విషయం తెలిసి ఖంగుతిన్న పోలీసులు..

Teen Harrasses Tuition Teacher: సాధారణంగా స్కూలు, ట్యూషన్లలో టీచర్లు స్టూడెంట్స్‌కు హోం వర్క్‌, ఎగ్జామ్స్‌ నిర్వహిస్తారు. వారు పూర్తి చేయకపోతే తప్పనిసరిగా పనిష్మెంట్‌ ఇస్తారు. అయితే, చెన్నైలో దీనికి విరుద్ధంగా ఓ వింత సంఘటన జరిగింది. సినిమా స్టైల్‌లో ఓ ట్యూషన్‌ టీచర్‌ను వేధించాడో ఓ టీనేజర్‌ అసలు విషయం తెలుసుకున్న పోలీసులు సదరు బాధితురాలు ఖంగుతిన్నారు ఆ వివరాలు తెలుసుకుందాం.

22 ఏళ్ల వయస్సున్న ఓ మిడిల్‌ క్లాసుకు చెందిన యువతి చెన్నైలో ఉంటారు. ఆమె నాన్నకు చిన్నపాటి వ్యాపారం ఉంది. అయితే, హఠాత్తుగా ఆమె ఇంటికి కొన్ని వందల సంఖ్యలో డెలివరీ పార్సిల్స్‌ రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా ఫుడ్‌ డెలివరీ యాప్‌ల ద్వారా క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆప్షన్‌ ఉపయోగించి డెలివరీలు వచ్చాయి. ఆమె ఇంటి అడ్రస్‌తోపాటు ఫోన్‌ నంబర్‌ కూడా డెలివరీ ఆప్షన్‌లో లింక్‌ అయి ఉంది. అయితే, ఆ ఆర్డర్లు తాను పెట్టలేదని వాటిని తిరస్కరించింది. ఇందులో మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి రాత్రి డన్నర్‌ వరకు ఫుడ్‌ ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. ఇంటికి కావాల్సిన సామగ్రీ, టూత్‌పేస్ట్‌ , బట్టలు, గిఫ్ట్‌ ఐటెమ్స్‌ వస్తూనే ఉన్నాయి. 

ఇలా ఒకదాని వెనుక మరోటి రెండు రోజుల్లో వందల కొద్ది డెలివరీలు వచ్చాయి. ఇది ఆ యువతికి పెద్దతలనొప్పిగా మారింది. డెలివరీ తీసుకోవడానికి నిరాకరించడంతో డెలివరీ ఏజెంట్లు కూడా ఆమెపై కోపగించుకుని వెళ్లేవారు. ఇక చేసేదేం లేక వెంటనే 100 నంబర్ పోలీసులకు కాల్ చేసి సహాయం అడిగారు. పోలీసులు సదరు డెలివరీ ఏజెంట్ల వద్ద వివరాలను ఆరా తీశారు. అయితే, ప్రాంకార్లు ఇలా చేసి ఉండొచ్చని చెప్పారు. ఆ ఫ్యామిలీ వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌ను సంప్రదించారు.

అయితే, ఇప్పుడు మరో పంథాలో ఆ యువతికి వేధింపులు మొదలయ్యాయి. ఇలా ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌లు బుకింగ్స్‌ వదిలేసి, క్యాబ్ బుకింగ్ మొదలైంది. వివిధ ఆన్‌లైన్‌ క్యాబ్‌ బుకింగ్స్‌ అయ్యేవి. ఒకరి తర్వాత మరొకరు వచ్చేవారు ఇలా రెండు రోజుల్లో 77 క్యాబ్స్‌ బుకింగ్స్‌ ఆ యువతి ఇంటి అడ్రస్‌కు బుక్‌ అయ్యాయి. విసిగిపోయిన సదరు అమ్మాయి పోలీసులకు మళ్లీ కంప్లైంట్‌ చేశారు. అయితే, ఈ కేసును ఛేదించడానికి పోలీసులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది.

Also Read: Necklace At Garbage: చెత్తకుప్పలో వజ్రల హారం.. గంటల్లో కార్మికులు ఏం చేశారో తెలుసా?

మొబైల్‌ ఫోన్, ఇమెయిల్‌ ఐడీ బుకింగ్స్‌, కాల్‌ రికార్డ్స్‌ అన్ని సేకరించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అసలు నిందితుడిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి టీనేజర్‌ కావడంతో వెంటనే అదుపులోకి తీసుకుని జువెనైల్‌ హోంకు తరలించారు. ఇలా ఎందుకు ఆ టీనేజర్‌ చేశాడో తెలిసి బాధితురాలు, పోలీసులు ఖంగుతిన్నారు. ఈ 17 ఏళ్ల టీనేజర్‌ ఆ యువతి ఉంటున్న పోరుగు ఇంట్లో ఉండేవాడు. బాధిత యువతి ట్యూషన్‌ చెప్పే సమయంలో ఆ టీనేజర్‌ ట్యూషన్‌ టీచర్‌పై ఇష్టం పెంచుకున్నాడు. ఆమెతో వింతగా ప్రవర్తించడం, ఇంట్లోకి దూసుకు వచ్చేయడం వంటివి చేసేవాడు. ఆమెను ప్రేమ పేరుతో వేధించేవాడు. విషయం తెలిసిన బాధితురాలి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ టీనేజర్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. అయినా తగ్గని ఆ టీనేజర్‌ ఇలా ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ చేస్తూ కొత్త పంథాలో వేధించడం మొదలు పెట్టాడు.

Also Read: Security Denied Dhoti Farmer: లుంగీ కట్టారని అనుమతించని సెక్యూరిటీ.. మాల్‌ ఎదుట రైతుల ధర్నా

ఐటీ యాక్ట్‌ ఇండియన్‌ పీనల్‌ కోర్డు ప్రకారం యువకుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు. మెజిస్ట్రేట్‌ కోర్డు ఆదేశంతో బెయిల్‌పై విడుదల అయ్యారు. సదరు యువతిని వేధించకూడదనే కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయితే, ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న సమయానికే 18 ఏళ్లు కూడా వచ్చాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News