Big King Cobra Viral Video: వీడబ్బా.. ఏంట్రా ఆ ధైర్యం.. కింగ్ కోబ్రా కాటేయటానికి వస్తే .. కాస్త కూడా భయం లేకుండా!

Big Size King Cobra Viral Video: ఓ వైపు ఆ నాగు పాము పడగ విప్పి మరీ బుసలు కొడుతుంటే.. అతడు మాత్రం ఆ నాగు పామును చూసి భయపడకుండా, ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా అందరూ చూస్తుండగానే క్షణాల్లో పామును ముందు నుంచే పట్టుకున్న తీరు చూస్తే అతడి ధైర్యానికి సాహో అని అనాల్సిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2023, 11:21 AM IST
Big King Cobra Viral Video: వీడబ్బా.. ఏంట్రా ఆ ధైర్యం.. కింగ్ కోబ్రా కాటేయటానికి వస్తే .. కాస్త కూడా భయం లేకుండా!

Big Size King Cobra Viral Video: చిన్న నాగు పామును వెనుక నుంచి చూస్తేనే కొంతమంది హడలిపోతుంటారు. అలాంటిది భారీ పొడవు, లావు ఉన్న నాగు పామును చూస్తే ఇక అక్కడి నుంచి ఏకంగా పరుగు అందుకునే వాళ్లు కూడా ఉంటారు. నాగు పాము అంటే కొంతమందికి అంత భయం. అవి మీదకు వచ్చే తీరు, పడగ విప్పి బుసలు కొట్టే తీరు ఆ భయానికి ఒక కారణం అయితే,.. అవి విషపూరితమైన జాతి సర్పాలు కనుక.. ఆ పాములు కరిస్తే బతికే అవకాశాలు తక్కువే అనే భయం ఉండటం మరో కారణం. అందుకే నాగు పామును చూస్తే చాలు హడలిపోతుంటారు.

అయితే, పాములను చూసి హడలిపోయే వాళ్లు కొందరైతే.. ఎంత భయంకరమైన పాములను చూసినా ఏ మాత్రం జంకకుండా వాటికి ఎదురెళ్లి మరీ పట్టుకునే వాళ్లు ఇంకొంత మంది ఉంటారు. వాళ్లకు ఎంత పెద్ద నాగు పాములను చూసినా భయం కాదు. పైగా పాము సైజు, ఆకారం పెరిగే కొద్ది వారికి ఆ పాములను పట్టడం ఒక సవాలుగా తీసుకుంటుంటారట. అందుకే పాములను చూసి పారిపోకుండా వాటికి ఎదురెళ్లి తమ నైపుణ్యాలను, ధైర్య సాహసాలకు పదును పెట్టుకుంటుంటారు. ఇదిగో ఇక్కడ యూట్యూబ్ లో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మీకు కూడా ఎగ్జాట్లీ అదే నిజం అని అనిపిస్తుంది. 

ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఒక భయంకరమైన నాగు పామును ఏ మాత్రం భయం లేకుండా ఎదురుగా వెళ్లి మరి చేత పట్టుకున్నాడు. ఓ వైపు ఆ నాగు పాము పడగ విప్పి మరీ బుసలు కొడుతుంటే.. అతడు మాత్రం ఆ నాగు పామును చూసి భయపడకుండా, ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా అందరూ చూస్తుండగానే క్షణాల్లో పామును ముందు నుంచే పట్టుకున్న తీరు చూస్తే అతడి ధైర్యానికి సాహో అని అనాల్సిందే. చూడ్డానికి ఒళ్లు జలధరించే భారీ కింగ్ కోబ్రాను అతడు హ్యాండిల్ చేసిన తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అతడికి అంత మొండి ధైర్యం ఎందుకు అనే సందేహం కూడా వస్తుంది. 

ఇది కూడా చదవండి: Huge Dangerous King Cobra: పడగ విప్పిన పాముకే కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్న మొనగాడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News