Side Effects of Red Bull: రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్‌తో భరించలేని అనారోగ్య సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్

Side Effects of Eed Bull: రెడ్ బుల్.. ఫ్రాన్స్, నార్వె, డెన్మార్క్ లాంటి దేశాల్లో కొంతకాలం పాటు ఈ రెడ్ బుల్‌పై నిషేధం విధించారు. అందుకు కారణం రెడ్ బుల్ డ్రింక్ ఆరోగ్యానికి హానీ చేస్తుందని ఆయా దేశాల ఆరోగ్య సంస్థలు హెచ్చరించడమే. అంతేకాదు.. గర్భిణిలు ఈ రెడ్ బుల్ తాగితే.. వారికి గర్బస్రావం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదట. రెడ్ బుల్ డ్రింక్‌లో అంత డేంజరస్ కంటెంట్స్ ఏమున్నాయి అని అనుకుంటున్నారా ?

Written by - Pavan | Last Updated : Jul 16, 2023, 08:38 AM IST
Side Effects of Red Bull: రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్‌తో భరించలేని అనారోగ్య సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్

Side Effects of Red Bull: రెడ్ బుల్.. ఎనర్జి డ్రింక్స్ పేరిట కూల్ డ్రింక్స్ తాగేవారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. అవును, రెడ్ బుల్ డ్రింక్ తయారీదారులు దానిని ఎనర్జీ డ్రింక్స్ కేటగిరీలో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, నిజంగానే రెబ్ బుల్ ఆరోగ్యానికి మంచిదా ? ఎనర్జి డ్రింక్ అన్న పేరుకి తగినట్టుగానే శరీరానికి శక్తిని అందిస్తుందా అంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే రెడ్ బుల్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల భిన్న వాదనలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఈ రెడ్ బుల్‌ని నిషేధిత ఉత్పత్తుల జాబితాలోనూ చేర్చారు. 

ఫ్రాన్స్, నార్వె, డెన్మార్క్ లాంటి దేశాల్లో కొంతకాలం పాటు ఈ రెడ్ బుల్‌పై నిషేధం విధించారు. అందుకు కారణం రెడ్ బుల్ డ్రింక్ ఆరోగ్యానికి హానీ చేస్తుందని ఆయా దేశాల ఆరోగ్య సంస్థలు హెచ్చరించడమే. అంతేకాదు.. గర్భిణిలు ఈ రెడ్ బుల్ తాగితే.. వారికి గర్బస్రావం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదట. రెడ్ బుల్ డ్రింక్‌లో అంత డేంజరస్ కంటెంట్స్ ఏమున్నాయి అని అనుకుంటున్నారా ? ఇందులో అధిక మోతాదులో ఉండే కెఫైన్, షుగర్ ఆరోగ్యంపై తీవ్ర దుష్ర్పభావం చూపిస్తుందనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెడ్ బుల్ ఎనర్జి డ్రింక్ తాగితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, కలిగే ఆరోగ్య సమస్యలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం రండి.

ఇన్‌సోమియా..
రెడ్ బుల్‌లో అధిక మోతాదులో ఉండే కెఫైన్ మనిషికి నిద్రను దూరం చేస్తుంది. ఇది తాగితే శక్తి వస్తుంది అని ఎక్కువ తాగుతారేమో.. శక్తి రావడం సంగతి అటుంచితే.. ఇందులోని కెఫైన్ వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది.

మెదడుపై తీవ్ర ప్రభావం
రెడ్ బుల్‌లో అధిక మోతాదులో ఉండే కెఫైన్ మనిషి మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కెఫైన్ ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు కలిగే సమస్య ఏంటంటే.. అది తాగిన వ్యక్తి ఆ ప్రభావంతో తీవ్ర అయోయం, గందరగోళానికి గురవడం జరుగుతుంది. కెఫైన్ మోతాదు మరీ ఎక్కువైతే మనిషి నిలువునా వణికిపోయే ప్రమాదం కూడా ఉంది. కెఫైన్‌కి అంత శక్తి ఉంటుంది.

అధిక బరువు
ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా రెడ్ బుల్‌లో షుగర్ లెవెల్స్ అధిక మోతాదులో ఉంటాయి. అధిక మోతాదులో షుగర్ తీసుకోవడం వల్ల స్థూలకాలం వచ్చే ప్రమాదం ఉంది. అలా పెరిగే అధిక బరువు చివరకు గుండెపై ప్రభావం చూపించే వరకు వెళ్తుంది.

విపరీతమైన తలనొప్పి
క్రమం తప్పకుండా రెడ్ బుల్ తాగే వారు ఒక్క రోజు తాగడం ఆపేస్తే.. వారిలో విపరీతమైన తలనొప్పి లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిత్యం అల్కాహాల్ తాగే వారు ఒక్క రోజు అల్కాహాల్ తాగడం మానేస్తే తట్టుకోలేరు. నిలకడగా ఉండలేరు. ఇది కూడా అలాంటి ప్రభావాన్నే చూపిస్తుందన్నమాట.

దంతాలకు హానీ
రెడ్ బుల్ డ్రింక్ అనేది ఎసిడిక్ డ్రింక్ లాంటిది. పైగా ఇందులో షుగర్ కూడా ఎక్కువ మోతాదులోనే ఉంటుంది. ఈ రెండు కూడా దంతాల ఆరోగ్యానికి హాని చేసేవే. ఎసిడిక్ వల్ల దంతాలపై ఎనామిల్ పొర లేచిపోతుంది. షుగర్ వల్ల దంతాల్లో పుప్పిళ్లు వచ్చే ప్రమాదం ఉంది. అంటే ఈ రెండు కూడా దంతాల అనారోగ్యానికి హేతువు అవుతాయన్న మాట.

భరించలేని విత్‌డ్రావల్ సింప్టమ్స్
రెగ్యులర్‌గా కెఫైన్ తాగే వారు కెఫైన్ తాగడం ఆపేస్తే.. వారిలో విత్‌డ్రావల్ సింప్టమ్స్ కనిపిస్తాయి. అంటే మనిషిలో ఏదో తెలియని ఆందోళన, చేతులు, కాళ్లు వణకడం, తలనొప్పి సమస్యలు ఎదురవుతాయన్నమాట. ఇలాంటి లక్షణాలే ఆల్కాహాల్ బాగా తాగే అలవాటు ఉండి అది మానేసే వారిలోనూ.. లేదంటే నిత్యం ఆల్కాహాల్ తాగి ఏదో ఒక రోజు గ్యాప్ వస్తే వారిలో కనిపించే లక్షణాలు లాంటివే ఇవి కూడా.  

టైప్ 2 డయాబెటిస్
రెడ్ బుల్ ఎక్కువగా తాగే అలవాటు ఉన్న వారు టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉంది. ఇందుకు కారణం ఇందులో అధిక మోతాదులో ఉండే చక్కరనే.

నాడీ వ్యవస్థ దెబ్బ తినే ప్రమాదం
అధిక మోతాదులో ఉండే గ్లూకోజ్ తీసుకోవడం వల్ల మెదడులోని నాడీ వ్యవస్థ దెబ్బ తినే ప్రమాదం ఉంది. శరీరంలోని వివిధ భాగాల నుంచి సమాచారాన్ని మోసుకెళ్లే నాడీ వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా మనిషి ఏం చేస్తున్నారో వారికే తెలిసే అవకాశం ఉండదు.

ఇది కూడా చదవండి : Side Effects of Maggi: మ్యాగీ తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌లో ప్రాణాంతకమైన జబ్బు ?

ఆల్కాహాల్ - రెడ్ బుల్ కలిపి సేవిస్తే..
ఆల్కాహాల్ - రెడ్ బుల్ కలిపి సేవిస్తే ఇక అంతే సంగతి. ఈ రెండు కలిపి తాగడం వల్ల మనిషి ప్రవర్తనలోనే విపరీతమైన మార్పు కనిపిస్తుంది. ఈ పరిస్థితిలోనూ వారు ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా ఉంటుంది. అందుకే ఇలాంటి కాంబినేషన్‌కి దూరంగా ఉంటే మరీ మంచిది.

ఇది కూడా చదవండి : Rs 20 per day to Rs 100 Cr Business: ఒకప్పుడు రూ. 20 కూలీ.. ఇప్పుడు రూ. 100 కోట్ల వ్యాపారానికి యజమాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News