Shocking Video: మహిళ నోటి నుంచి బయటికి వచ్చిన 4 అడుగుల పాము

నోరు తెరిచి నిద్రపోవడం మంచిది కాదు అని పెద్దవాళ్లు  చెప్పడం ..చాలా మంది వాటిని పట్టించుకోవడం సాధారణం.

Last Updated : Aug 31, 2020, 08:07 PM IST
    • నోరు తెరిచి నిద్రపోవడం మంచిది కాదు అని పెద్దవాళ్లు చెప్పడం ..చాలా మంది వాటిని పట్టించుకోవడం సాధారణం.
    • చాలా మంది నోరు తెరిచి గురకలు పెడుతూ నిద్రపోతుంటారు.
    • అలాగే నిద్రపోయిన ఒక రష్యన్ ( Russia ) మహిళకు ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది.
Shocking Video: మహిళ నోటి నుంచి బయటికి వచ్చిన 4 అడుగుల పాము

నోరు తెరిచి నిద్రపోవడం మంచిది కాదు అని పెద్దవాళ్లు  చెప్పడం ..చాలా మంది వాటిని పట్టించుకోవడం సాధారణం. చాలా మంది నోరు తెరిచి గురకలు పెడుతూ నిద్రపోతుంటారు. అలాగే నిద్రపోయిన ఒక ఒక రష్యన్ ( Russia ) మహిళకు ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది. ఆమె నోటిలోకి పెద్ద పాము దూరిపోయింది.

ఈ ఘటన రష్యాలో జరిగింది. డగెస్టాన్ ప్రాంతంలో నివసించే ఒక మహిళా గుర్రుపెట్టి నిద్రపోయింది. మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక పాము ఆమె నోటి నుంచి తిన్నగా పొట్టలోకి దూరిపోయింది. ఇంతా జరుగుతున్నా... అంత పెద్ద పాము నోట్లోకి వెళ్తున్న ఆమె మాత్రం నిద్రనుంచి మేలుకోలేదు. తీరా నిద్రలేచాక కడుపులో ఏదో కదులుతున్నట్టు గమనించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లింది.

డాక్టర్లు ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆమె నోట్లోకి ఒక ట్యూబ్ పంపించి చివరికి కడుపులో పాము ఉన్నట్టు తెలుసుకుని షాకయ్యారు. ట్యూబ్ లో ఒక కెమెరా ఉండటంతో దాని ద్వారా పాము మూమెంట్స్ చూసి.. ఒక గ్రిప్పర్ ద్వారా పామును మెల్లిగా బయటకు తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) చెలామణి అవుతోంది.

Trending News