Security Guard Drawing Eyes On Painting: సాధారణంగా మొదటి రోజే ఉద్యోగం పోవడం చాలా చాలా అరుదు. ప్రపంచ వ్యాప్తంగా ఇలా జరగడం కూడా మనం ఎప్పుడూ వినుండం కూడా. మొదటిరోజు ఏ తప్పు చేసినా.. సరిదిద్దుకునేందుకు ఓ అవకాశం ఇస్తారు. మరలా అదే రిపీట్ చేస్తే అప్పుడు జాబ్ నుంచి తీసేస్తారు. కానీ ఓ ఆర్ట్ గ్యాలరీ తమ సెక్యూరిటీ గార్డును ఉద్యోగంలో చేరిన మొదటి రోజునే తీసేసింది. బోర్ కొడుతుందని విలువైన పెయింటింగ్‌ను పాడుచేసినందుకు అతడిపై చర్యలు తీసుకుంది.
పశ్చిమ-మధ్య రష్యాలోని యెకాటెరిన్బర్గ్ నగరం బోరిస్ ఎల్ట్సిన్ ప్రెసిడెన్షియల్ సెంటర్లో ఓ వ్యక్తి సెక్యూరిటీ గార్డ్‌గా విధుల్లో చేరాడు. ఆర్ట్ గ్యాలరీలోని పెయింటింగ్‌లను, ఆస్తుల్ని రక్షించాల్సిన బాధ్యతను యాజమాన్యం అతడికి అప్పజెప్పింది. ఆ వ్యక్తి మొదటిరోజే బోర్‌గా ఫిల్ అయ్యాడు. దాంతో అక్కడ ప్రదర్శనలో ఉన్న 'త్రీ ఫిగర్స్' పెయింటింగ్‌పై తన విసుగును ప్రదర్శించాడు. ఆ పెయింటింగ్‌లో ఉన్న మూడు చిత్రాలకు ముఖాకృతి ఖాళీగా ఉండడంతో.. సదరు గార్డ్ అందులోని రెండు ముఖాలపై తన బాల్‌పాయింట్ పెన్నుతో కళ్లను గీశాడు.
'త్రీ ఫిగర్స్' పెయింటింగ్‌లో ఉన్న రెండు చిన్న చిత్రాలకు సెక్యూరిటీ గార్డ్ కళ్లను గీశాడు. ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శనను వీక్షించేందుకు వచ్చిన కొందరు పెయింటింగ్‌లో మార్పును గుర్తించి నిర్వాహకులకు సమాచారం అందించారు. పెయింటింగ్‌లో బొమ్మలకు కళ్లు గీసింది ఎవరో తెలుసుకున్న యాజమాన్యం.. అతడిని విధుల్ని తొలగించింది. 2021 డిసెంబరు 7న ఈ ఘటన జరిగినట్లు అక్కడి పత్రికలు పేర్కొన్నాయి. అయితే సెక్యూరిటీ గార్డ్ వివరాలను మాత్రం ఆర్ట్ గ్యాలరీ యాజమాన్యం బయటికి చెప్పలేదు.
Artist Anna leporskaya's $1million painting named 'Three Figures' was ruined after a security guard drew pair of eyes on the faceless figures in the painting. On being asked he is said to have become bored on the first day of his duty.@MailOnline pic.twitter.com/36lTMEzHcB
— Illuminate- The Learning Hub of MAIMS (@IlluminateMaims) February 10, 2022
1932 మరియు 1934 మధ్య రష్యన్ అవాంట్-గార్డ్ కళాకారుడు కజిమిర్ మాలెవిచ్ విద్యార్థి అన్నా లెపోర్స్కాయ 'త్రీ ఫిగర్స్' పేరిట ఈ కళాఖండాన్ని సృష్టించారు. ఈ పెయింటింగ్ వాస్తవ ధరపై స్పష్టత లేదు కానీ దీని పేరిట రూ.7.51 కోట్ల (74.9 మిలియన్ రష్యన్ రూబుల్స్) విలువైన బీమా ఉంది. ఇక ఆ పెయింటింగ్‌పై సెక్యూరిటీ గార్డ్ పెన్నుతో బలంగా గీయకపోవడంతో.. పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. అయితే దానికి అసలు రూపంకు తెచ్చేందుకు రూ.2.5 లక్షలు (2,50,000 రష్యన్ రూబుల్స్) ఖర్చవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సదరు సెక్యూరిటీ గార్డుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also Read: IND vs WI 3rd ODI: టీమిండియాదే బ్యాటింగ్.. రాహుల్, చహల్ ఔట్! మూడు మార్పులతో బరిలోకి భారత్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook