Viral Video : ఎగసిపడిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం.. పిల్లలను ఓ కంట కనిపెట్టండి

దీపావళి వచ్చిందంటే కాంతులతో వీధులు వెలిగిపోవాల్సిందే.. కానీ ఇంటర్నెట్ లో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. టపాసులు కాల్చే సమయంలో అజాగ్రత్తగా ఉంటే ఎంత ప్రమాదమో ఈ వీడియో తెలియజేస్తుంది..   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 01:38 PM IST
  • టపాసులు కాల్చే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి
  • పిల్లలు టపాసులు కాలుస్తుంటే వెలువడిన మంటలు
  • తృటిలో తప్పిన ప్రమాద.. నెట్టింట్లో వైరల్ అయిన వీడియో
Viral Video : ఎగసిపడిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం.. పిల్లలను ఓ కంట కనిపెట్టండి

Safe Diwali: పండగ అంటేనే ఒక సంబరం. ఇంటిల్లిపాదీ ఒక్కచోట చేరి ఆనందోత్సహాలతో జరుపుకునే వేడుక. ప్రస్తుతం దేశమంతా దీపాల పండగైన దీపావళి వేడుకలకు సిద్దమవుతోంది. దీపావళి అనగానే దీప కాంతులే కాదు.. టపాసులూ గుర్తొస్తాయి. పండగ రాత్రి ఇంటిల్లిపాదీ టపాసులు కాల్చి వేడుక జరుపుకుంటారు. ముఖ్యంగా చిన్నారులకు టపాసులు కాల్చడమంటే చాలా సరదా. కుటుంబ సభ్యులతో,స్నేహితులతో కలిసి దీపావళి నాడు టపాసుల మోత మోగిస్తారు. అయితే ఈ క్రమంలో వారిని ఓ  కంట కనిపెడుతూ జాగ్రత్తపడాలి.

టపాసులు పేల్చే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా... నిర్లక్ష్యంగా వ్యవహరించినా పండగ పూట విషాదాన్ని కొనితెచ్చుకున్నట్లవుతుంది. ఆకతాయి తనంతో ఎక్కడపడితే అక్కడ టపాసులు కాల్చడం కూడా ప్రమాదకరమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇందుకు మంచి ఉదాహరణ.

Also Read: Bheemla Nayak Update: గెట్ రెడీ ఫర్ దీపావళి ట్రీట్.. సాయంత్రం 'లాలా భీమ్లా' ప్రోమో

ఆ వీడియోను గమనిస్తే కొంతమంది చిన్నారులంతా ఒక్కచోట చేరి డ్రైనేజీ పైకప్పుపై టపాసులు వెలిగించేందుకు ప్రయత్నించడం గమనించవచ్చు. ఆ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో.. అందరూ భయంతో తలో దిక్కు పరిగెత్తారు. ఆ తర్వాత కొద్దిసేపటివరకూ ఆ డ్రైనేజీ హోల్స్ నుంచి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ దృశ్యం సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూనే... వారికి తగిన జాగ్రత్తలు చెప్పాలి. ముఖ్యంగా డ్రైనేజీ పైప్ లైన్స్, డ్రైనేజీ హోల్స్ ఉన్న దగ్గర టపాసులు పేల్చవద్దని వారికి తెలియజేయాలి. డ్రైనేజీ హోల్స్ నుంచి మీథేన్ వాయువు విడుదలవుతుంటుంది కాబట్టి.. అక్కడ క్రాకర్స్ కాల్చినా, టపాసులు పేల్చినా పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది.

Also Read: Huzurabad Bypoll Results: పిల్లాడిలా ఏడ్చేసిన గెల్లు శ్రీనివాస్..?? వీడియో వైరల్

అలాగే, చేతులకు శానిటైజర్ రాసుకుని టపాసులు పేల్చవద్దని పిల్లలకు తెలియజేయాలి. టపాసులు కాల్చే సమయంలో కాటన్ దుస్తులనే ధరించాలని, టపాసులు కాల్చాక చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని వారికి చెప్పాలి. ఈ  చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే పండగను కుటుంబమంతా సంతోషంగా జరుపుకోవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

Trending News