ఆ సిన్మా విడుదలైతే "అర్జున్‌రెడ్డి" ఫ్లాప్

  

Last Updated : Nov 9, 2017, 04:58 PM IST
ఆ సిన్మా విడుదలైతే "అర్జున్‌రెడ్డి" ఫ్లాప్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే "అర్జున్ రెడ్డి" చిత్ర దర్శకుడు సందీప్ వంగాని కలిసిన ఆర్జీవి, ఆయన చెప్పిన ఓ కథ విన్నారట. ఆ కథ చాలా కొత్తగా ఉందని.. తనకు బాగా నచ్చిందని.. ఆ సినిమా కథతో పోలిస్తే.. అర్జున్ రెడ్డి చిత్రాన్ని తాను ఫ్లాప్ అనాల్సి వస్తుందని, ఆ కథ విన్నాక తనకే ఎందుకా ఆలోచన రాలేదని అసూయగా ఉందని ఆర్జీవి తెలిపారు. ఆ కథను చిత్రంగా తీస్తే గొప్ప సక్సెస్ అవుతుందని కూడా చెప్పారు. ఇదే విషయాన్ని వర్మ ఫేస్బుక్ ద్వారా కూడా వెల్లడించారు. అర్జున్ రెడ్డి సినిమా విడుదలయ్యాక, ఆ చిత్ర దర్శకుడికి మంచి మిత్రుడైపోయారు వర్మ. ఆ చిత్రానికి మద్దతిస్తూ.. తాను గతంలో మాట్లాడారు కూడా. ప్రస్తుతం వర్మ "లక్ష్మీస్ ఎన్టీఆర్" చిత్రంతో బాగా బిజీగా ఉన్నారు. అలాగే అక్కినేని నాగార్జున హీరోగా మరో సినిమాని కూడా మొదలుపెట్టబోతున్నారు. ఇప్పుడు సందీప్ వంగా తీయబోయే చిత్రంపై ఆర్జీవి చేసిన కామెంట్స్ ఆ చిత్రంపై ప్రేక్షకులకు మరింత ఆసక్తిని పెంచాయి 

 

Trending News