Raksha Bandhan 2024: ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రపంచవ్యాప్తంగా హిందూవులు ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. ఆగస్టు 19వ తేదీన సోమవారం రాఖీ పండుగ రావడంతో ప్రపంచమంతా హిందూవులు ఆనందోత్సాహాలతో చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే కొన్ని చోట్ల మాత్రం రాఖీ పండుగను ప్రజలు చేసుకోరు. రాఖీ పండుగ చేసుకుంటే తమకు అనర్థం జరుగుతుందని కొన్ని గ్రామాలు గ్రామాలే నమ్ముతున్నాయి. దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఆయా గ్రామాల్లో రాఖీ పండుగను చేసుకోవడం లేదు. అక్కడ రాఖీపై పూర్తి నిషేధం ఉన్న గ్రామాలు ఏమిటో తెలుసుకోండి.
Also Read: Raksha Bandhan 2024: రాఖీపై అపోహాలు వద్దు.. రాఖీ ఎప్పుడో కట్టాలో చెప్పిన పండితులు
రాఖీ పండుగ చేసుకుంటే తమకు అనర్థమని.. తమకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయని ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల ప్రజలు విశ్వసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జగత్‌పూర్వ, ధౌలానా, సురానా, బైనీపూర్ చాక్ తదితర గ్రామాల్లో రాఖీ చేసుకోరు. యూపీలోని వజీరాగంజ్ పంచాయతీలో ఉన్న జగత్‌పూర్వలో రాఖీ పండుగను 65 సంవత్సరాలకు పైగా రాఖీ పండుగ చేసుకోవడం లేదు. రాఖీ పండుగ చేసుకుంటే గ్రామంలో విషాద సంఘటనలు చోటుచేసుకుంటాయని ఆ గ్రామస్తులు నమ్ముతున్నారు.
Also Read: Bharat Bandh: ఈనెల 21న భారత్ బంద్.. స్కూల్స్, దుకాణాలు అన్నీ మూత?
రాఖీ కడితే విషాదాలు
ఈ గ్రామంలో 1955లో జరిగిన ఓ సంఘటన రాఖీ పండుగ రోజే చోటుచేసుకోవడం కలకలం రేపింది. రాఖీ కట్టుకున్న అనంతరం ఓ యువకుడు ఆ గ్రామంలో మృతిచెందాడు. దీంతో అప్పటి నుంచి ఆ గ్రామంలో రాఖీ పండుగ రోజు కీడు జరుగుతుందని నమ్మడం ప్రారంభమైంది. తర్వాత పదేళ్ల తర్వాత మళ్లీ రాఖీ పండుగ చేసుకోవడానికి గ్రామస్తులు ప్రయత్నం చేశారు. పదేళ్ల తర్వాత చేసుకున్న రాఖీ పండుగ రోజు కూడా ఒక మళ్లీ విషాదం జరగడంతో గ్రామస్తులు ఇక రాఖీ పండుగను నిషేధం విధించుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు చేసుకోవడం లేదని తెలుస్తోంది.
ఘోరీ దండయాత్ర?
ఇక అదే రాష్ట్రం మీరట్ ప్రాంతంలోని సురానా అనే గ్రామంలో కూడా రాఖీ పండుగ చేసుకోరు. దీనికి చారిత్రక కారణం ఉందని సమాచారం. ఓ కథనం ఆ గ్రామస్తులు చెబుతున్నారు. 12వ శతాబ్దంలో రాఖీ పండుగ రోజున నాటి రాజు మహ్మద్ ఘోరీ సురానా గ్రామంపై దండయాత్ర చేశారు. ఆ గ్రామస్తులందరినీ చంపేశాడంట. అయితే ఓ మహిళ, ఇద్దరు మగ పిల్లలు బతికి బయటపడ్డారు. ఆ పిల్లలు కొన్ని సంవత్సరాల తర్వాత రాఖీ పండుగ చేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఒకరు దివ్యాంగుడు అయ్యాడంట. దీనికి మహ్మద్ ఘోరీ శాపం వెంటాడుతోందని నమ్మారు. అదే కథనం ఇప్పటికీ ఆ గ్రామంలో ప్రచారంలో ఉంది. ఈ నమ్మకంతో రాఖీ పండుగ చేసుకోరని సమాచారం.
మరికొన్ని గ్రామాలు
సంభాల్ జిల్లా బైనీపూర్ చాక్‌లో వింత కథనం ఉంది. సోదరులకు వారి సోదరులు రాఖీ కట్టాక ఆస్తి అడిగితే ఆ సోదరులు గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. అలా ఆస్తి ఇచ్చుకుంటూ పోవడంతో సోదరులంతా డబ్బులేని వాళ్లు అయ్యారంట. ఇక అప్పటి నుంచి రాఖీ పండుగ చేసుకోవడం నిషేధం విధించుకున్నారంట. ఇదే రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలోని గున్నార్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో రాఖీ పండుగ చేసుకోరు. ఇక ధౌలానా అనే గ్రామంలో కూడా రాఖీ పండుగ నిషేధం ఉంది. ఇలా ఉత్తరప్రదేశ్‌లోనే రాఖీ పండుగ చేసుకోకపోవడం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter