Rabbit vs Cobra Snake Fighting: జంతు సామ్రాజ్యం ఎంతో విశాలమైన ప్రపంచం మాత్రమే కాదు.. అంతే పెద్ద విభిన్నమైన ప్రపంచం కూడా. జంతు ప్రపంచంలో ఎప్పటికప్పుడు లెక్కలేనన్ని అద్భుతాలు మనల్ని కనువిందు చేస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. సూక్ష్మమైన కీటకాల నుండి జంతువులను వేటాడే సింహాలు, పులుల వరకు అడవిలో ఉండే ప్రతీ జీవి ఏదో ఒక ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు వీటి కదలికలు చూడాలంటే అడవిలోకి కానీ లేదా జూ పార్కుకి కానీ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో వైరల్ వీడియోలు మన కళ్ల ముందుకే వచ్చి వాలిపోతున్నాయి. అలాంటి వైరల్ వీడియోనే తాజాగా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా పాము, ముంగిసల మధ్య వార్ జరగడం మనం చూస్తుంటాం. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. కానీ మొదటిసారిగా అందుకు భిన్నంగా పాము, కుందేలు మధ్య జరిగిన వార్ వీడియో ఒకటి వెలుగులోకొచ్చింది. మామూలుగా అయితే పాము విషపూరితమైనది కనుక పాపం కుందేలు పని అయిపోయినట్టేనని అనుకున్నారంతా.. కానీ ఈ పోరాటంలో కుందేలు తగ్గేదే లేదన్నట్టుగా వీరోచిత పోరాటం చేసి విజయం సాధించింది. అదెలానో చెప్పడం కాదు గానీ మీ కళ్లతో మీరే స్వయంగా చూసేయండి మరి.
గట్టి పట్టుదల, ఆత్మవిశ్వాసం, ప్రత్యర్థిపై పట్టు సాధించాలి అన్న సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే అని పెద్ద వాళ్లు చెబుతుంటారు కదా.. ఇక్కడ కుందేలు, పాము మధ్య వార్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. కుందేలు వీరోచిత పోరాటం ముందు పాము తోక ముడిచింది. ఇక పోరాడలేను అన్నట్టుగా వెంటనే పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది. అయినా సరే కుందేలు ఊరుకోలేదు. నన్ను కెళికి మధ్యలో విత్ డ్రా అయి వెళ్లిపోతే నేను ఎందుకు ఊరుకుంటాను అన్నట్టుగా కుందేలు కూడా పామును అనుసరిస్తూ పొదల్లోకి పరుగెత్తడం మనం ఈ వీడియోలో చూడొచ్చు.
కుందేలు చిన్న జంతువే అయినా.. మనకు పెద్ద సక్సెస్ మంత్రాన్నే నేర్పింది కదా. అయితే, ఇక్కడ ఒక్కటే సందేహం వేధిస్తోంది.. కుందేలును కాటేయడానికి పాము ఎన్నోసార్లు ప్రయత్నించింది కదా.. ఆ కుందేలుకు పాము కాటు పడకపోతే సంతోషం. లేదంటే పాము కాటేసిన విషం ఆ కుందేలును ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. అంటే ఆలస్యంగానైనా సరే.. శత్రువు కుట్రలకు బలి కావొద్దంటే, అసలు శత్రువు దెబ్బకు కూడా దొరక్కుండా తప్పించుకోవాలన్న నీతి కూడా ఇందులో దాగుంది చూశారా ?