Python Kebab: 20 అడుగుల పైథాన్ ను చక చక 20 మిషాల్లో వండి తినేసి ఘనులు..

Viral Video, 3 Mens cut 20 feet Python and Eat Kebabs. చికెన్ కబాబ్‌, మటన్ కబాబ్‌, ఫిష్ కబాబ్‌ మాదిరిగానే కొండచిలువ కబాబ్‌ కూడా ఉంటుంది. నమ్మకుంటే ఈ వీడియో చూడండి.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 27, 2022, 10:19 AM IST
  • ఓరి నీ దుంపతెగ.. అది కోడా లేక పామా
  • క్షణాల్లో 20 అడుగుల పైథాన్ ను వండుకొని తినేసిన ఘనులు
  • వీడియోకి 37,700,658 వ్యూస్
Python Kebab: 20 అడుగుల పైథాన్ ను చక చక 20 మిషాల్లో వండి తినేసి ఘనులు..

Python Kebab Viral Video, 3 Mens cut 20 feet Python and make Kebabs: చికెన్ కబాబ్‌, మటన్ కబాబ్‌, ఫిష్ కబాబ్‌.. ఇలానే చాలా రకాల కబాబ్‌లు మనకు తెలుసు. రోడ్డుపైకి ఎక్కామంటే చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్‌లలో మనకు ఇవి కనిపిస్తాయి. మాంసాహారులు అందరూ చికెన్ లేదా మటన్ కబాబ్‌ను నిత్యం తింటుంటారు. అయితే కొండచిలువ కబాబ్‌ కూడా ఉంటుందని మీకు తెలుసా. మీరు వింటుంది నిజమే. కొందరు కొండచిలువ కబాబ్‌ను తింటున్నారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వీడియో ప్రకారం... 20 అడుగుల కొండచిలువను అడవిలోని కొన్ని జంతువులు చంపేశాయి. స్నేక్ కాచర్స్ దాన్ని కొందరికి అప్పగించారు. ముగ్గురు కలిసి ఆ పామును కారులో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లారు. కత్తుల సాయంతో 20 అడుగుల కొండచిలువ చర్మాన్ని తీస్తారు. ఓ సమయంలో తోలు రాకపోవడంతో... మెషిన్ సాయంతో తీస్తారు. ఆపై కొండచిలువను ముక్కలు ముక్కలుగా కోస్తారు. చికెన్, మటన్ ముక్కల మాదిరిగా తయారు చేసుకుని పెద్ద బౌల్‌లో వేస్తారు. 

ముగ్గురు కలిసి కొండచిలువ ముక్కలకు ఉప్పు, కారం, ఆయిల్, మసాలాలు పట్టిస్తారు. ఆ ముక్కలను ఓ చీకుకు గుచ్చి (చికెన్ ముక్కల మాదిరి) మంటలో కాలుస్తారు. మరోవైపు కర్రీ కూడా వండుతారు. ఈ సమయంలో మరో ఇద్దరు కూడా వస్తారు. అందరూ కలిసి మందు తాగుతూ.. ఆ కొండచిలువ కబాబ్‌లను తింటారు. చాలా బాగుందంటూ గబగబా తినేస్తారు. ఇందుకు సంబందించిన వీడియోను 'GEORGY KAVKAZ' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో పాతదే అయినా.. ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోకి 37,700,658 వ్యూస్ వచ్చాయి. 

Also Read: IND vs PAK: ఒత్తిడిలో ఎలా ఆడాలో విరాట్ కోహ్లీ నేర్పుతాడు: రిషబ్ పంత్

Also Read: T20 World Cup 2022: భారత్‌పై విధ్వంసం సృష్టించిన ప్లేయర్ వరల్డ్ కప్‌లోకి ఎంట్రీ.. ఇక బాదుడే బాదుడు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News