Optical Illusion Photo: ఈ చిత్రంలో ఏనుగు దాగుంది.. దాన్ని కనుగొంటే మీరు మేధావులే!

Optical Illusion Photo: సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక రకాల ఆప్టికల్ ఇల్యూషన్స్ ఉన్నాయి. కొన్ని చాలా సులభం, కొన్ని చాలా క్లిష్టమైనవి. అయితే అలాంటి క్లిష్టమైన ఆప్టికల్ ఇల్యూషన్ పిక్ ను ఒకటి పోస్ట్ చేశాం. అందులో ఏనుగు దాగి ఉంది. అదెక్కడ ఉందో మీరే కనుగొనండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 30, 2022, 11:47 AM IST
Optical Illusion Photo: ఈ చిత్రంలో ఏనుగు దాగుంది.. దాన్ని కనుగొంటే మీరు మేధావులే!

Optical Illusion Photo: ఇటీవల అనేక మైండ్ బ్లోయింగ్ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటి సొల్యూషన్ కనుగొనేందుకు నెటిజన్లు బుర్రలు బద్దలు కొట్టుంకుంటున్నారు. అది పజిల్ పిక్చర్ అయినా లేదా పెయింటింగ్‌లో దాగి ఉన్న ఏదైనా ఆప్టికల్ భ్రమలను పరిష్కరించడం సరదాగా ఉండే ప్రక్రియ. అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిన ఏనుగును ఎవరైనా గుర్తించగలరా? అని ఓ సవాలుతో పిక్ ట్రెండ్ అవుతున్నాయి. కానీ, దాని సమాధానం కనిపెడితే మీరే మేధావులుగా పరిగణించవచ్చు. 

ఈ చిత్రంలో ఏనుగును గమనించారా?

వంద మందిలో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఈ చిత్రాన్ని చూసిన తర్వాత స్పందించారని.. చాలామంది గంట సమయం తీసుకున్నారని నెటిజన్లు చెబుతున్నారు. మరికొంతమంది ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూసినా సమాధానం చెప్పలేకపోయారు. ఈ చిత్రంలో మీరు చేతిలో తుపాకిని పట్టుకున్న వ్యక్తిని చూడవచ్చు. 

పెయింటింగ్‌లో దట్టమైన అడవులు, చెట్లు, మొక్కలు కనిపిస్తాయి. మరికొందరు సైనికులు చేతిలో తుపాకులు పట్టుకుని వెనకాల నడుస్తున్నారు. ఈ చిత్రంలో ఏనుగు ఎక్కడ దాగి ఉందో తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని టిక్‌టాక్ స్టార్ హెక్టిక్ నిక్ షేర్ చేశాడు. ఈ భ్రమను పరిష్కరించడానికి ప్రేక్షకులకు సవాలు విసిరాడు.

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ.. 'ఈ చిత్రంలో దాగి ఉన్న ఏనుగును కేవలం ఒక శాతం మంది మాత్రమే కనుగొనగలరు' అని అన్నారు. ఇది అంత సులభం కాదు.. కానీ మీ ఫోన్‌ని తిప్పి చూడండి. అప్పుడు మీరు ఏనుగును కనుగొనవచ్చు. ఎంతసేపు చూసినా ఏనుగు కనిపించకపోవడం వల్ల చిత్రం కోసం వెతుకుతున్న వారు ఆశ్చర్యపోయారు. ఈ చిట్కాలతో ఏనుగును కనుగొనడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు ఏనుగు కనిపిస్తుంది. 

Also Read: Viral News: ఫోటోగ్రాఫర్ లేడనే కారణంతో పెళ్లినే రద్దు చేసుకున్న వధువు.. బిత్తరపోయిన వరుడు...

Also Read: Optical Illuison Photo: మీ కళ్లకు ఓ సవాల్..! ఈ ఫొటోలోని రాళ్ల మధ్య దాగున్న జంతువు ఏది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News