Optical illusion: ఈ చిత్రం చూసి..చిత్తరువయ్యేనా..ఎన్ని ముఖాలున్నాయి మొత్తం

Optical illusion: కంటికి కన్పించేది నిజం కాదు. అలాగని నిజమంతా కంటికి కన్పించదు. ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు కూడా అంతే. వాస్తవం కంటికి కన్పించదు. అంతా భ్రమింపజేస్తుంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 19, 2022, 08:35 AM IST
 Optical illusion: ఈ చిత్రం చూసి..చిత్తరువయ్యేనా..ఎన్ని ముఖాలున్నాయి మొత్తం

Optical illusion: కంటికి కన్పించేది నిజం కాదు. అలాగని నిజమంతా కంటికి కన్పించదు. ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు కూడా అంతే. వాస్తవం కంటికి కన్పించదు. అంతా భ్రమింపజేస్తుంది. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఛాలెంజింగా ఉంటూనే ఫన్నీగా ఉండటంతో జనం ఆసక్తి చూపిస్తున్నారు. ఆప్టికల్ ఇల్యూజన్ అనేది భ్రమింపజేయడం కంటే చూసే కోణాన్ని బట్టి ఫోటో కన్పిస్తుందనడం మంచిది. ఆప్టికల్ ఇల్యూజన్ పిక్చర్స్‌లో మనం చూసే కోణాన్ని బట్టి ఫోటో కాన్సెప్ట్ మారుతుంది. అటువంటిదే ఓ ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటో గురించి తెలుసుకుందాం.

ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలకున్న ట్రెండింగ్ కారణంగా నిత్యం పెద్దఎత్తున ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు అప్‌లోడ్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫోటోల్ని షార్ప్ మైండ్ ఉన్నవాళ్లు కూడా నిగ్గు తేల్చలేకపోతున్నారు. తెలివైనవారికి సైతం ఈ ఫోటోలు పరీక్ష పెడుతుంటాయి. అటువంటిదే ఓ పెయింటింగ్ వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదే ఈ పెయింటింగ్. ఈ పెయింటింగ్‌లో మొత్తం 7 ముఖాలు దాగున్నాయి. కానీ బయటకు మాత్రం మూడే కన్పిస్తాయి.

ఈ ఫోటో ఓ వృద్ధుడిది. ఇందులో ఏకంగా 7 ముఖాలు దాగున్నాయి. ఆ ఏడు ముఖాల్ని గుర్తించడమే ఈ ఫోటో ఛాలెంజ్. తెలివైనవాళ్లు సైతం ముూడే గుర్తించగలుగుతున్నారు. కానీ అతికొద్దిమందిమాత్రం 7 ముఖాల్ని గుర్తిస్తున్నారు. మరి మీరు కూడా మీ ట్యాలెంట్ చూపించండి. ఒకవేళ మీరు పెయింటింగ్‌లో 7 ముఖాల్ని గుర్తించలేకపోతే..ఇబ్బంది పడవద్దు. మేం మీకు ఆ 7 ముఖాలు ఎక్కడున్నాయో చూపించేస్తాం.

Optical illusion image, how many of you can see seven faces

మొత్తం కన్పించే ముఖం ఒకటైతే..రెండు కళ్లలో ఇమిడి ఉన్న రెండు ముఖాలు. రెండు కళ్ల మధ్య ఓ అమ్మాయి ఆకారం. ఇక ఐదవది నోరున్న స్థానంలో కూర్చుని ఉన్న మరో వ్యక్తి. ఇక మిగిలిన రెండు..రెండు కళ్ల మధ్యలో ఇమిడున్న రెండు ముఖాలు.

Also read: OMG Video: వారెవ్వా.. మట్టి కుండలు తయారు చేస్తున్న పిల్లి.. వైరల్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News