Child Kills Snake in Bihar: బీహార్‌లోని గయా జిల్లాలో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 12 నెలల పసివాడు పామును నోటితో కొరికి చంపడం షాక్‌కు గురిచేస్తోంది. బొమ్మ అనుకుని మూడు అడుగుల పాముతో ఆడుకున్న ఆ బుడ్డోడు.. అనంతరం ఆ పాము మధ్యలో కొరికేశాడు. అదే సమయంలో బాలుడి తల్లి అక్కడికి రాగా.. వెంటనే గమనించి కొడుకుని పాముకు దూరంగా ఎత్తుకు వెళ్లింది. అనంతరం వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. బాలుడిని పరిశీలించిన వైద్యులు క్షేమగా ఉన్నట్లు వెల్లడించారు. పాము విషపూరితమైనది కాదని చెప్పారు. బాలుడు పామును మధ్య కరవడంతో అది చనిపోయింది. ప్రస్తుతం ఈ సంఘటన నెట్టింట భారీగా వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా..
గయా జిల్లాలోని ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జముహర్ గ్రామంలో ఏడాది వయసున్న రియాన్ష్ అనే బాలుడు ఇంటి టెర్రస్‌పై ఆడుకుంటున్నాడు. అటు వైపు పాము రాగా.. అది బొమ్మగా భావించిన ఆ బుడ్డోడు దాంతో ఆడుకున్నాడు. అనంతరం దాన్ని మధ్యలో కొరికాడు. అప్పుడే టెర్రస్‌పైకి వచ్చిన బాలుడి తల్లి.. పామును చూసి భయపడిపోయింది. బాలుడిని కరిచిందేమోనని కంగారు పడింది. వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి తీసుకువెళ్లింది. బాలుడికి చికిత్స అందించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. బాలుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు.
Boy from Bihar bites snake to death. Doctors declare him safe. Snake association demands justice. pic.twitter.com/6xjErC7f5H
— Dr. Ajayita (@DoctorAjayita) August 21, 2024
చిన్నారిని కాటు వేసినా.. అది పాము విషం లేని పాము కావడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదన్నారు. బాలుడి కాటుతో పాము చనిపోయింది. ప్రస్తుతం ఈ సంఘటన నెటిజన్లను ఆందోళనకు గురిచేస్తోంది. చనిపోయిన పాము మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై బాలుడి తల్లి మాట్లాడుతూ.. తన కొడుకు టెర్రస్‌పై ఆడుకుంటున్నాడని.. అంతలో ఎక్కడి నుండో ఒక్కసారిగా పాము పిల్ల వచ్చిందన్నారు. ఆ పామును బొమ్మగా భావించి పట్టుకున్నాడి.. పామును నోట్లో పెట్టుకుని నమలడం ప్రారంభించాడని తెలిపారు. తాను చూసి వెంటనే షాక్ అయ్యాయనని.. వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు చెప్పారు. తన కొడకు పామును నమలడంతో అది చనిపోయిందన్నారు.
కాగా.. ఇటీవల బీహార్‌లో ఓ వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. వెంటనే మెలకువ రాగా.. పామును పట్టుకుని తిరిగి దాన్ని నమిలాడు. పామును తిరిగి కరిస్తే.. విషం ఎక్కదని స్థానికంగా ఓ నమ్మకం. దీంతో అతను పామును కొరికి చంపేశాడు. ఆ వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. ప్రాణాలతో బయటపడ్డాడు.
Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.