9 Foot Rat Snake: బాబోయ్ 9 అడుగుల పాము.. ప్రపంచంలోనే అతి పెద్ద ర్యాట్ స్నేక్

9 Foot Rat Snake Video Goes Viral: స్వతహాగా యూట్యూబర్ కూడా అయిన జే.. అప్పుడప్పుడు కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. ఆ వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచేవిగా ఉంటాయి. కానీ జే మాత్రం చాలా అంటే చాలా క్యాజువల్‌గా వాటితో ఆడుకుంటుంటాడు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో కూడా ఒళ్లు జలదరించేదిగానే ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2023, 07:17 PM IST
9 Foot Rat Snake: బాబోయ్ 9 అడుగుల పాము.. ప్రపంచంలోనే అతి పెద్ద ర్యాట్ స్నేక్

9 Foot Rat Snake Video Goes Viral : చాలా మందికి పాములు అంటేనే ఎక్కడా లేని భయం. పాములను చూస్తే చాలు ఆమడ దూరం పరుగెడుతారు. పామును దగ్గరిగా చూస్తే ఇక వాళ్లు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. జీవితంలో ఏదో యమ గండాన్ని దాటేసినట్టుగా కథకథలుగా చెప్పుకుంటుంటారు. కానీ కొంతమందికి మాత్రం పాములు అంటే ప్రాణం. ప్రాములతోనే స్నేహం చేస్తారు.. పాములతోనే టైమ్ పాస్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే తమ జీవితంలో విలువైన సమయాన్ని పాములు, వాటి సంరక్షణ కోసమే కేటాయిస్తుంటారు. 

అలాంటి వారిలో జే బ్రూవర్ కూడా ఒకరు. జంతు ప్రేమికుల మాదిరిగా స్వతహాగా సర్పాల ప్రేమికుడైన జే బ్రూవర్‌కి జూ కీపింగ్ అంటే ఇష్టం. జూ తరహాలో తనే సొంతంగా ఏర్పాటు చేసిన ఆవాసంలో అరుదైన జాతికి చెందిన పాములు, భారీ పొడవైన పాములు, పెద్ద పెద్ద విష సర్పాలకు తన జూలో చోటు కల్పించాడు. అంతేకాదు.. పెద్ద పెద్ద కొండచిలువలు కూడా ఉన్నాయిక్కడ. జే బ్రూవర్‌కి స్నేక్ సైన్స్ బాగా అలవడింది. అందుకే అవి ఎప్పుడు ఎలా స్పందిస్తుంటాయో కూడా అంచనా వేస్తుంటాడు. పైగా వాటి బాగోగులు కూడా తనే దగ్గరుండి చూసుకుంటుంటాడు. 

స్వతహాగా యూట్యూబర్ కూడా అయిన జే.. అప్పుడప్పుడు కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. ఆ వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచేవిగా ఉంటాయి. కానీ జే మాత్రం చాలా అంటే చాలా క్యాజువల్‌గా వాటితో ఆడుకుంటుంటాడు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో కూడా ఒళ్లు జలదరించేదిగానే ఉంది. 

9 అడుగులు పొడవు ఉన్న ర్యాట్ స్నేక్‌ని చేత పట్టుకుని దాని ప్రత్యేకతలు చెబుతున్నాడు. ఇలాంటి జాతి పాముల్లో ప్రపంచంలోనే అతి పొడవైన పాముల్లో ఇదీ ఒకటి అంటూ పరిచయం చేస్తున్నాడు. ఇంతలోనే ఆ పాము జేపైకి దూసుకుపోయింది. దాదాపు కాటేసినంత పనిచేసింది. కానీ పాముల గురించి బాగా తెలిసిన వ్యక్తి కావడంతో జే ఆ పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. ఈ పాము విషపూరితమైన పామే కానీ అంత ఎక్కువగా విషం ప్రభావం ఉండదు అని చెబుతున్నాడు. ఏదేమైనా అప్పుడప్పుడు జే చేసే రిస్కీ స్టంట్స్ చూస్తుంటే భయం వేస్తోంది అంటున్నారు నెటిజెన్స్.

Trending News