Dislike button on BJP youtube channel: న్యూ ఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైరస్‌ని నివారించేందుకు మరిన్ని కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ( PM Modi ) అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి అనంతరం జాతిని ఉద్దేశించి ఏడోసారి మాట్లాడిన ప్రధాని.. కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సమయం కాదని అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) వచ్చిన వెంటనే అది అవసరమైన ప్రతీ ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని చెప్పారు. కొవిడ్-19 నివారణకు పాటించాల్సిన నిబంధనలు, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను ( COVID-19 guidelines ) తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేశారు. Also read : AP CM YS Jagan: వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు
ఇదిలావుండగా.. లైవ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వీక్షిస్తున్న ట్విటర్ యూజర్స్ మోదీ మాట్లాడుతున్న యూట్యూబ్ ఛానెల్‌పై ఓ తేడాను గమనించారు. ప్రధాని మోదీ మాట్లాడుతుండగానే బీజేపి సదరు యూట్యూబ్ ఛానెల్‌పై డిజ్‌లైక్ బటన్‌ని ఆఫ్ చేసిందని గమనించిన నెటిజెన్స్.. అదే విషయాన్ని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు.
BJP turned off the Dislike button after 4.5k dislike came within minutes pic.twitter.com/jDOtPCMqZS
— Nehr_who? (@Nher_who) October 20, 2020
ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే 4.5 వేల డిజ్‌లైక్స్ వచ్చాయని, ఈ కారణంగానే ఆ డిజ్‌లైక్స్ సంఖ్య మరింత పెరగకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్త చర్యగా బీజేపి ఈ పని చేసి ఉంటుందని నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు. Also read : Divya Tejaswini's parents: ముఖ్యమంత్రిని కలిసిన దివ్య తల్లిదండ్రులు
Dislike andolan is still on #BoycottModiBhasan 😂😂😂😂😂 pic.twitter.com/TMwSuToIQ1
— SANKALP SHIRODKAR (@SANKALP4664) October 20, 2020
As usual IT cell got active and removed dislike and like count 😂
#BoycottModiBhasan
#Dislike pic.twitter.com/jOVkCv0ABd— {®}--------------{©} (@ReaL_TwEe8S) October 20, 2020
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe