Mother Emotional Letter: కన్నా ప్రపంచంలోనే అత్యుత్తమ కొడుకివి నువ్వే రా.. కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి లేఖ

Matt Glad Letter From Mother: ఓ కన్న తల్లి తన కుమారుడికి లేఖ రాసింది. కుమారుడిపై ఉన్న ప్రేమనంతా కలిపి ఆమె అక్షరాల రూపంలో వివరించింది. అయితే ఆమె చనిపోయిన తర్వాత కుమారుడు గుర్తించాడు. తల్లి రాసిన ఆఖరి లేఖను చూసి ఆ కుమారుడు కన్నీటి పర్యంతమయ్యాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 29, 2024, 06:26 PM IST
Mother Emotional Letter: కన్నా ప్రపంచంలోనే అత్యుత్తమ కొడుకివి నువ్వే రా.. కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి లేఖ

Matta Glad Shares Mother Letter: 'నాపై నీకున్న ప్రేమ ఎంతో తెలుసు. నా కోసం ఎన్నో త్యాగాలు చేశావు రా. నిన్ను వదిలి వెళ్లాలంటే మరణం కన్నా భయంగా ఉంది' అంటూ ఓ తల్లి తన కుమారుడికి లేఖ రాసింది. తన చికిత్స కోసం కుమారుడి పడిన కష్టాన్నంతా లేఖలో ప్రస్తావించింది. అయితే ఈ లేఖను తల్లి చనిపోయిన తర్వాత ఆ కుమారుడు గుర్తించాడు. ఏదో వెతుకుతున్న క్రమంలో ఈ లేఖ బయటపడింది. ఆ లేఖను పరిశీలించగా తన తల్లి రాసినట్లు గుర్తించి భావోద్వేగానికి లోనయ్యాడు.

మాట్‌ గాల్డ్‌ అనే వ్యక్తి తన తల్లి రాసిన లేఖను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. కొన్నాళ్ల కిందట క్యాన్సర్‌తో చనిపోయిన తన అమ్మ ఇలా లేఖ రాసిందని చెబుతూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. 'నేను తనను ప్రతిరోజూ మిస్సవుతున్నా. ఈ లేఖను చూస్తే కన్నీరు ఉబికి వస్తోంది. కానీ నేను చిరునవ్వుతో ఏడుస్తా. పరిస్థితులు ఇప్పుడు కఠినంగా ఉన్నాయి. ఇప్పుడు నాన్న కూడా క్యాన్సర్‌తో పోరాడుతూ ఐసీయూలో ఉన్నాడు. మీ అందరికీ ఒక్కటే చెబుతున్నా. మిమ్మల్ని తల్లిదండ్రులు ప్రతిరోజూ ప్రేమిస్తారు అనే విషయం గుర్తుంచుకోండి' అని పంచుకున్నాడు.
 

A letter from my mom that I found after she passed away from cancer
byu/MattGald inMadeMeSmile

లేఖలో కొడుక్కి తల్లి ఈ విధంగా రాసింది. తల్లి ఎంతో భావోద్వేగంతో ప్రేమపూర్వకంగా ఆ లేఖ రాసింది. అందులో కుమారుడు తన కోసం పడిన తపన, కష్టాన్నంతా వివరించింది. 'నిన్ను వదిలి వెళ్లాలంటే చావు కన్నా భయంగా ఉంది' అంటూ ఆమె లేఖలో రాసింది. తన కోసం ఎంతో కష్టపడ్డావని.. నీకు ఏమిచ్చినా తక్కువేనని పేర్కొంది. ప్రపంచంలోనే ఉత్తమ కొడుకువి నువ్వే అని కొడుకును ప్రశంసిస్తూ తల్లి లేఖలో రాసింది.

'నాకు అవసరమైనప్పుడుల్లా నీవు నాకు తోడుగా ఉన్నావు. నా కోసం నీ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నావు. నా చికిత్స కోసం డబ్బులు సరిపోకపోయినా నీవు చాలా కష్టపడ్డావు. నేను నిన్ను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటా. నిన్ను వదిలి వెళ్లాలనే భయం చావు కన్నా భయకరంగా ఉంది. నీకు ఏమిచ్చినా తక్కువే రా. నేను ప్రేమించడం తప్ప నేను ఏం చేయలేను. నువ్వు ఎప్పటికీ ఉత్తమ కొడుకువే. నువ్వు కోరుకున్న వ్యక్తి నీకు లభించాలని.. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అని తన కుమారుడు గాల్డ్‌కు తల్లి లేఖలో చెప్పింది.

Also Read: Sharmila Meets Sunitha: షర్మిల మరో సంచలనం.. వివేకా కూతురు సునీతతో భేటీ

Also Read: RS Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఎన్నిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News