Viral News: మెట్రో రైలును కాపాడిన తిమింగలం శిల్పం

Whale Statue Stopped Metro Train | నెథర్లాండ్స్ దేశంలోని ఒక నగరం రాటర్ డ్యామ్ ఒక మెట్రో ట్రైన్ తన చివరి స్టేషన్ దగ్గర ఆగకుండా వేగంగా దూసుకెళ్లింది. సాంకేతిక సమస్య వల్ల ఆగకుండా ముందుకు వెళ్లిన ఆ మెట్రో ట్రెయిన్ ( Metro ) చివరికి ఒక తిమింగలం శిల్పం వల్ల పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. 

Last Updated : Nov 7, 2020, 07:47 PM IST
    1. నెథర్లాండ్స్ దేశంలోని ఒక నగరం రాటర్ డ్యామ్ ఒక మెట్రో ట్రైన్ తన చివరి స్టేషన్ దగ్గర ఆగకుండా వేగంగా దూసుకెళ్లింది.
    2. సాంకేతిక సమస్య వల్ల ఆగకుండా ముందుకు వెళ్లిన ఆ మెట్రో ట్రెయిన్ చివరికి ఒక తిమింగలం శిల్పం వల్ల పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది.
Viral News: మెట్రో రైలును కాపాడిన తిమింగలం శిల్పం

Metro Train Stopped By Whale Statue | నెథర్లాండ్స్ దేశంలోని ఒక నగరం రాటర్ డ్యామ్ ఒక మెట్రో ట్రైన్ తన చివరి స్టేషన్ దగ్గర ఆగకుండా వేగంగా దూసుకెళ్లింది. సాంకేతిక సమస్య వల్ల ఆగకుండా ముందుకు వెళ్లిన ఆ మెట్రో ట్రెయిన్ ( Metro Train ) చివరికి ఒక తిమింగలం శిల్పం వల్ల పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. 

Also Read | Corona Vaccine Updates:  కోవిడ్-19 వ్యాక్సిన్ ముందుగా లభించేది ఈ 30 కోట్ల మందికే,  వివరాలు చదవండి!

ప్రపంచవ్యాప్తంగా రోజూ ఎన్నో ప్రమాదాలు ( Accidents )  జరుగుతూ ఉంటాయి. ఇందులో ఎంతో మంది మరణిస్తారు. కొంత మంది లక్కీగా ఎస్కేప్ అవుతారు. అలాంటి అద్భుతమే రాటర్ డ్యామ్ నగరంలో జరిగింది. ఒక మెట్రో రైలు తన గమ్యస్థానికి చేరుకున్నాక కూడా ఆగకూండా ముందుకు చాలా దూరం వెళ్లింది. తరువాత ఏం జరుగుతుందో అని అక్కడి వాళ్లు ఉత్కంఠతతో చూస్తూనే ఉన్నారు.

Also Read | Diwali Special Lamp: ఎప్పుడూ ఆరిపోని దీపాన్ని తయారు చేశాడు..పూర్తి వివరాలు చదవండి

అదుపుతప్పిన మెట్రోరైలు అన్ని స్టేషన్లను దాటుకుంటూ చివరి స్టేషన్ వద్ద కూడా ఆగకుండా దూసుకెళ్తూ.. రైల్ పట్టాలు లేని మార్గం వైపు వెళ్లింది. వెళ్తూ వెళ్తూ అది ఎదురుగా ఉన్న ఒక తిమిగలం విగ్రహాన్ని తాకి ఆగిపోయింది. మీరు చిత్రంలో మెట్రో ట్రైన్ ఆగడాన్ని చూడవచ్చు. ఆ ఒక్క విగ్రహం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ ట్రైను ఆగిన సమయంలో అందులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. తిమిగలం ( Whale ) తోక భాగం అడ్డుపడటంతో రైలు ఆగిపోయింది. దాంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 50 మంది ప్రాణాలు సేవ్ అయ్యాయి. 

Also Read | Firecrackers in Diwali: టపాసులపై బ్యాన్ విధించిన 6 రాష్ట్రాలు. లిస్ట్ చెక్ చేయండి

అయితే తిమింగలం తోక భాగంలో ఇరుక్కున్న మెట్రో ట్రైన్ ను ఎలా కాపాడాలో అర్థం అవడంలేదట ఇంజినీర్లకు. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి అక్కడి అధికారులు దర్యాప్తును ప్రారంభించారట. ఒకప్పుడు అందం కోసం మాత్రమే అనుకున్న తిమింగలం విగ్రహం ఇలా ఎంతో మంది ప్రాణాలు కాపాడింది అని మెచ్చుకుంటున్నారు ప్రజలు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News