Apple iPhone 13 Pro Max: లక్ష రూపాయల ఫోన్ ఆర్డర్ చేస్తే...డైరీ మిల్క్ చాక్లెట్స్ వచ్చాయి..!

Viral: ఈ మధ్య తరచుగా ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులకు పెద్ద పెద్ద షాక్ లు ఇస్తున్నాయి. మనం ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి డెలివరీ చేస్తున్నాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2021, 06:37 PM IST
Apple iPhone 13 Pro Max: లక్ష రూపాయల ఫోన్ ఆర్డర్ చేస్తే...డైరీ మిల్క్ చాక్లెట్స్ వచ్చాయి..!

Apple iPhone 13 Pro Max: ఈ మధ్య ఆన్ లైన్ (Online)లో పెద్ద మెుత్తంలో ఏదైనా ఆర్డర్ చేస్తే భయమేస్తుంది. ఎందుకంటే మనం ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా సబ్బులు, రాళ్లు, ఇటుకలు ఏవేవో వస్తున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి లక్ష రూపాయలు విలువచేసే ఆఫిల్ ఐఫోన్ ఆర్డర్ చేశాడు. తీరా పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్ తిన్నాడు. ఎందుకంటే పార్శిల్ లో టాయిలెట్ పేపర్ లో చుట్టబడిన రెండు చాక్లెట్ లు ఉన్నాయి. 

వివరాల్లోకి వెళితే..
ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌కు చెందిన డేనియల్ కారోల్ లక్ష రూపాయల విలువ గల ఐఫోన్ 13 ప్రో మాక్స్ (Apple iPhone 13 Pro Max) ను డిసెంబర్ 2న ఆఫిల్ వెబ్ సైట్ (Apple Website) లోకి వెళ్లి ఆర్డర్ పెట్టాడు. డిసెంబర్ 17న డెలివరీ తేదీగా ఇచ్చారు. పార్శిల్ రాకపోగా..డెలివరీ చేయాల్సిన రోజున డీహెచ్ఎల్ (DHL) నుంచి వివాదాస్పద మెసెజ్స్ వచ్చాయని కారోల్ (Daniel Carroll ) వెల్లడించాడు. ఇక విసుగు చెందిన అతడు ట్రాకింగ్ చేసి డిపోకు వెళ్లి..పార్శిల్ కలెక్ట్ చేసుకున్నాడు. 

Also Read: Online Classes Instructions: ఆన్‌లైన్‌లో ఏది చేయకూడదు, ఏది చేయాలో తప్పనిసరిగా తెలుసుకోండి

అతడు ఇంటికి వచ్చిన తర్వాత టేప్ వదులుగా ఉండటం గమనించాడు. కానీ ఆ పెట్టె బరువుగా ఉండటంతో ఓపెన్ చేసి చూశాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అందులో టాయిలెట్ రోల్ తో చుట్టబడిన రెండు డైరీ మిల్క్ ఓరియో చాక్లెట్స్ (Cadbury’s White Oreo chocolate bars) ఉన్నాయని బాధితుడు వాపోయాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. ఈ ఘటనపై  డీహెచ్ఎల్ స్పందించింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని..కారోల్ కు న్యాయం చేస్తామని డీహెచ్ఎల్  ప్రతినిధి ఒకరు చెప్పారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News