Lion in Park: ఇంటి పార్క్‌లో దాక్కున్న సింహం, తీరా దగ్గరకు వెళ్లి చూస్తే...ఏమైందంటే

Lion in Park: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఆందోళన కల్గించే వీడియోలు లేదా వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే కెన్యా నుంచి వచ్చిన ఓ ఫోటో రేపిన కలవరం అంతా ఇంతా కాదు. కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ స్వయంగా ఈ ఫోటో ట్వీట్ చేసింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 9, 2022, 03:39 PM IST
 Lion in Park: ఇంటి పార్క్‌లో దాక్కున్న సింహం, తీరా దగ్గరకు వెళ్లి చూస్తే...ఏమైందంటే

Lion in Park: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఆందోళన కల్గించే వీడియోలు లేదా వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే కెన్యా నుంచి వచ్చిన ఓ ఫోటో రేపిన కలవరం అంతా ఇంతా కాదు. కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ స్వయంగా ఈ ఫోటో ట్వీట్ చేసింది.

మౌంట్ కెన్యా నేషనల్ పార్క్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఓ సింహాన్ని చూసినట్టు వార్త వెలువడింది. పార్క్ ప్రాంతంలో ప్రజలు ఆ సింహాన్ని చూసిన వెంటనే...కంగారు పడిపోయారు. వెంటనే లయన్ రెస్క్యూ టిమ్‌కు ఫోన్ చేశారు. ఇది జరిగింది కెన్యాలోని ఓ ఊరిలో. సమాచారం అందుకోగానే అటవీశాఖ సిబ్బంది ఆయుధాలతో సహా అక్కడికి చేరుకున్నారు. అలార్మ్ మోగించారు. కిన్యానా గ్రామాన్ని పరిశీలించారు. ఆ తరువాత అంతకంటే ఆశ్చర్య కల్గించే విషయాన్ని కనుగొన్నారు.

అసలేం జరిగిందంటే..చెట్ల మద్య ఓ సింహం ముఖాన్ని అక్కడి తోటమాలి చూసి భయపడ్డాడు. పూర్తిగా చూడకుండానే కంగారు పడిపోయాడు. తన యజమాని ఇంటి ముందున్న ఆవరణలో ఓ బెంచ్ కింద చెట్ల మధ్యలో చూశాడు. కానీ అది వాస్తవానికి సింహం మొఖంతో ఉన్న ఓ బ్యాగ్. చెట్ల మధ్యలో ఉండటంతో దూరం నుంచి చూస్తే ఎవరైనా సింహమే అనుకుంటారు. ఆ తోటమాలి కూడా అదే అనుకుని భయపడి కంగారు పడిపోయి..అటవీ శాఖాధికార్లకు సమాచారమందించాడు. అటవీశాఖాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని గ్రామమంతా పరిశీలించారు. ఆ ప్రాంతంలో పూర్తిగా పరిశీలించగా..అది ఒక బ్యాగ్ అని తేలింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా ట్రోలింగ్ జరుగుతోంది. 

Also read: Viral Video: ఆ పిల్లాడు చేసిన చిలిపికి స్వీపర్ వణికిపోయాడు..నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News